బుల్లితెర పై ప్రసారమవుతున్నటువంటి బిగ్ బాస్ కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ కార్యక్రమం ప్రస్తుతం తెలుగులో ఏడవ సీజన్ ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 10 వారాలను పూర్తి చేసుకుని 11వ వారం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ 5 విన్నర్ గా నిలిచినటువంటి కంటెస్టెంట్ సన్నీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సీజన్ విన్నర్ గా నిలిచినటువంటి ఈయన వరుస సినిమా అవకాశాలను అందుకుంటున్న సంగతి మనకు తెలిసిందే.
ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సన్నీ బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఇదివరకే ఎన్నో విషయాలను వెల్లడించారు. తాజాగా ఈ కార్యక్రమంలో విన్నర్ గెలుచుకొనే ప్రైజ్ మనీ గురించి కూడా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విన్నర్ గా నిలిచినటువంటి వారికి 50 లక్షల ప్రైజ్ మనీ తో పాటు కప్పు కూడా ఇస్తారు ఇలా గెలిచిన వారికి డబ్బుతో పాటు వారి కెరియర్ లో ఇతర అవకాశాలు వస్తాయని భావించే ప్రతి ఒక్కరు గెలవడానికి కష్టపడుతూ ఉంటారు.
అలా సీజన్ ఫైవ్ లో గెలిచినటువంటి (Vj Sunny) సన్నీ తనకు ఛానల్ వారు 50 లక్షల రూపాయల ప్రైజ్ మనీ అందించినప్పటికీ అందులో టాక్స్ కట్ చేసుకుని ఇస్తారని తెలిపారు. సగానికి సగం టాక్స్ వాళ్ళు తీసుకొని నాకు మిగిలినది ఇచ్చారని సన్ని తెలిపారు. టాక్స్ రూపంలోనే దాదాపు 27 లక్షల రూపాయలు వాళ్లే కట్ చేసుకున్నారని ఈయన వెల్లడించారు. కష్టపడి గేమ్ ఆడినది నేనైతే ప్రైజ్ మనీ తీసుకున్నది మాత్రం గవర్నమెంట్ వాళ్లు అంటూ ఈయన కామెంట్లు చేశారు.
చాలామంది మేము ఎన్నో సేవా కార్యక్రమాలకు డొనేట్ చేస్తాము అంటూ టాక్స్ కట్టకుండా వారు ఆ డబ్బును తీసుకుంటారు. మనకి అన్ని తెలివితేటలు లేకపోవడంతో బిగ్ బాస్ ప్రైజ్ మనీ సగం మొత్తం గవర్నమెంట్ టాక్స్ రూపంలో తీసుకుందని ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.