బిగ్ బాస్ సీజన్ 7 మొత్తం సీరియల్ బ్యాచ్.., వర్సెస్ స్పై బ్యాచ్ మద్యలో వార్ తో హైలెట్ అయ్యిందనే చెప్పాలి. కానీ, ఆఖరి వారం వచ్చేసరికి ఇప్పుడు విన్నర్ ఎవరు అవ్వబోతున్నారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. నిజానికి స్పై బ్యాచ్ కే ఎక్కువ రేంజ్ లో ఓటింగ్ అనేది పడుతోంది. ఈసారి చాలా హ్యూజ్ గా అన్ని సీజన్స్ కంటే ఎక్కువగా ఓటింగ్ అనేది జరుగుతోందనేది టాక్. శివాజీ ఇన్సిడెంట్ తో శివాజీ సపోర్టర్స్ అందరూ కూడా హ్యాజ్ గా ఓటింగ్ చేస్తున్నారు. అంతేకాదు, ఎవరి కంటెస్టెంట్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్లకి సపోర్ట్ గా రీల్స్ చేస్తున్నారు. ఓట్ వేయమని రిక్వస్ట్ చేస్తున్నారు.
ఈనేపథ్యంలో అన్ అఫీషియల్ పోలింగ్ ఎలా ఉంది. బోటమ్ లో ఎవరు ఉన్నారు. విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికి ఉంది అనేది ఒక్కసారి చూసినట్లయితే.., పల్లవి ప్రశాంత్ ని అన్ అఫీషియల్ లో ఎవరూ కూడా బీట్ చేయలేకపోతున్నారు. కానీ అఫీషియల్ పోలింగ్ లో ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఇంకా వారం రోజులు ఓటింగ్ అనేది ఉంది కాబట్టి, లాస్ట్ లో ఏదైనా జరగచ్చు. మిస్డ్ కాల్స్ అనేది నిజానికి పల్లవి ప్రసాంత్ కి ఎక్కువగా వస్తున్నాయ్. ఇంకోటి ఏంటంటే., శివాజీకి ఓట్ క్యాంపైన్ అనేది కూడా మొదలైంది. సో, అన్ అఫీషియల్ లో ఓట్లు వేయని వాళ్లు హాట్ స్టార్ లో వేసేవాళ్లు ఎక్కువగా ఉంటారు.
ఇక మరోవైపు పల్లవి ప్రశాంత్ కూడా రాకెట్ లా ఓటింగ్ లో దూసుకుపోతున్నారు. 32 పర్సెంట్ లాస్ట్ వీక్ వచ్చింది. ఇప్పుడు ఇంకా ఇది పెరిగే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పల్లవి ప్రసాంత్ కి మిస్డ్ కాల్స్ అనేది ఎక్కువగా వస్తాయ్. విలేజ్ నుంచీ ఓటింగ్ అనేది బాగా జరుగుతుంది. అలాగే, చాలామంది అబ్రోడ్ వాళ్లు కూడా ఓట్ వేసే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి శివాజీ ఇంకా పల్లవి ప్రశాంత్ వీరిద్దరి మద్యలోనే ఫైనల్ పోరు ఉంటుందా ? లేదా బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఏదైనా ట్విస్ట్ ఇస్తాడా అనేది చాలామందిలో అసక్తిని రగిలిస్తోంది.
లాస్ట్ మినిట్ లో శివాజీని థర్డ్ ప్లేస్ లో పెట్టి అమర్ దీప్ ఇంకా పల్లవి ప్రశాంత్ ఇద్దరినీ స్టేజ్ పైకి తీస్కుని వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అప్పుడు విన్నర్ ఎవరు అనేది డిసైడ్ అవ్వడం అనేది చాలా కష్టం. నిజానికి అమర్ దీప్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అమర్ దీప్ కి గతంలో నామినేషన్స్ లోకి వచ్చినప్పటి దానికంటే కూడా ఎక్కువగానే ఓటింగ్ అనేది వస్తోంది. కానీ, శివాజీని బీట్ చేయలేకపోతున్నాడు. మరి అలాంటపుడు పల్లవి ప్రశాంత్ ని ఎలా బీట్ చేస్తాడు అనేది ఇక్కడ సందేహమే.
కాబట్టి, విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా తగ్గిపోతున్నాయ్. శోభా బయటకి వచ్చింది కాబట్టి ఏదైనా క్యాంపైన్ చేసినా, లేదా వేరే సీరియల్ ఆర్టిస్ట్ లందరూ కలిసినా పెరిగే ఛాన్స్ ఉంది. కానీ.., శోభాశెట్టి అర్జున్ కి ఓట్ వేస్తానని అర్జున్ కి సపోర్ట్ చేస్తానని చెప్పింది కాబట్టి, అమర్ కి హ్యూజ్ ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ కనిపించడం లేదు. ఇక యావర్ గురించి చూసుకుంటే మొదట్లో ఉన్న ఓటింగ్ అనేది యావర్ ఎందుకో కాపాడుకోలేకపోయాడు. ఇక్కడ పల్లవి ప్రశాంత్ ఇంకా శివాజీ ఇద్దరూ నామినేషన్స్ లో ఉన్నప్పుడు యావర్ కి ఎప్పుడూ ఓటింగ్ తగ్గిపోతుందనేది వాస్తవం.
వాళ్లిద్దరూ లేనప్పుడు మాత్రమే 20 పర్సెంట్ దాటి వచ్చేది. మరోవైపు ప్రియాంక – అర్జున్ ఇద్దరి గురించి చెప్పుకుంటే విన్నర్ అయ్యే క్వాలిటీ కంటే కూడా ఎవరు ముందు ఎలిమినేట్, ఎవరు వెనక ఎలిమినేట్ అనే లెక్కలు వేసుకుంటేనే బెటర్ అనే అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో టాప్ 6 , ఇంకా 5లో వీళ్లిద్దరే ముందు ఎలిమినేట్ అవుతారు. ఆ తర్వాత యావర్, అమర్ దీప్, శివాజీ పల్లవి ప్రశాంత్ ఇలా ఆర్డర్ ఉండచ్చని అన్ అఫీషియల్ పోలింగ్స్ చెప్తున్నాయి. అదీ మేటర్.