బిగ్ బాస్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుని ప్రేక్షకులకు దగ్గరైన కంటెస్టెంట్లలో బషీస్ బశి ఒకరు. మలయాళ బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిన బషీర్ బశి తాజాగా మరోసారి తండ్రయ్యారు. బషీర్ బసు రెండో భార్య మశూరా తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే బషీర్ బశి మొదటి భార్య ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. సుహానా తన పోస్ట్ లో మశూరాకు బాబు పుట్టాడని తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని మీ ఆశీర్వాదాలు మాపై అలాగే ఉంచండి అంటూ రాసుకొచ్చారు.
కొడుకును చూసి ఎమోషనల్ అవుతున్న ఫోటోను షేర్ చేస్తూ సుహానా ఈ పోస్ట్ చేయడం గమనార్హం. సుహానా మంచితనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సుహానా చేసిన ఈ పోస్ట్ కు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో లైక్స్ వస్తుండటం గమనార్హం. సినీ ప్రముఖులు, అభిమానులు మశూరా మగబిడ్డకు జన్మనిచ్చినందుకు ఆమెకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మాసూరా గర్భం దాల్చిన రోజు నుంచి ఇప్పటివరకు ప్రతి ఘటనను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ వచ్చారు.
అప్పుడే పుట్టిన బాబుకు సంబంధించిన వీడియోను యూట్యూబ్ లో రిలీజ్ చేయగా ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. 2009 సంవత్సరంలో బశీర్ బశి సుహానాను వివాహం చేసుకున్నారు. 2018 సంవత్సరంలో బషీర్ మసూరాను రెండో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. బషీర్ బశి సూర్య జోడీ నంబర్ వన్ అనే ప్రోగ్రామ్ లో ఇద్దరు భార్యలతో కలిసి పాల్గొని వార్తల్లో నిలిచారు.
అప్పుడే పుట్టిన బాబు పేరుపై ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను సైతం ఓపెన్ చేయడం గమనార్హం.బశీర్ బశి ఇద్దరు భార్యల విషయంలో ప్రేమతో మెలిగారని అందుకే వాళ్లు ఒకరిపై ఒకరు అభిమానాన్ని కలిగి ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?