Geethu Royal: నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ కార్యక్రమానికి తెలుగులో నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈయన మూడవ సీజన్ నుంచి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు అయితే నాగార్జున ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడం గురించి గతంలో ఈయనపై ఎన్నో విమర్శలు వచ్చాయి. ఈయన తప్పు చేసిన వారిని మందలించారని వాళ్లకు అనుకూలంగా ఉన్నటువంటి వారిని మాత్రమే తిడతారు అంటూ చాలామంది విమర్శలు చేశారు. హోస్ట్ ఎప్పుడు కూడా అందరి పట్ల న్యాయంగా వ్యవహరించాలి కాని బిగ్ బాస్ కార్యక్రమంలో మాత్రం తప్పు చేయని వారిని కూడా తప్పు చేసినట్లు చిత్రీకరించి తిడుతూ ఉంటారు

నాగార్జున. ఈ విషయం గురించి ఎంతోమంది బహిరంగంగా నాగార్జున పై విమర్శలు కురిపించారు. అయితే తాజాగా మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ గీతూ రాయల్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. గీతూ రాయల్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి మనకు తెలిసిందే. అయితే అంతకుముందే ఈమె బిగ్ బాస్ రివ్యూయర్ గా చేయడంతో ఈ కార్యక్రమాన్ని తరచు ఫాలో అవుతూ ఉండేవారు

అయితే కంటెస్టెంట్ ల పట్ల నాగార్జున వ్యవహార శైలి ఏ మాత్రం బాగోలేదు అంటూ తాజాగా ఈమె కామెంట్ చేశారు. హోస్ట్ గా నాగార్జున వేస్ట్ అని ఆయన తప్పు చేసిన వారి బెండు తీయడని తలతిక్కగా ఉన్న వారి స్క్రూలు టైట్ చేయరనీ ఈమె మాట్లాడారు. బిగ్ బాస్ వేదికపై కంటెస్టెంట్లను అడగాల్సిన ప్రశ్నలు ఈయన అడగడం లేదని

ఈయన షో ఫాలో కాకుండా బిగ్ బాస్ నిర్వహకులు ఇచ్చే స్క్రిప్ట్ మాత్రమే చదువుతున్నారు అంటూ అసలు విషయం బయటపెట్టారు. బిగ్ బాస్ వేదికపై నాగార్జున చేయలేని పనిని నేను బజ్ కార్యక్రమంలో చేస్తున్నాను అంటూ ఈ సందర్భంగా నాగార్జున గురించి (Geethu Royal) ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus