Keerthi Bhat: బుల్లితెర నటి కీర్తి, కార్తిక్ ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

బుల్లి తెర సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నటి కీర్తి భట్ గురించి అందరికీ సుపరిచితమే. పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా నటిగా మంచి గుర్తింపు పొందారు. ఇలా సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు. బిగ్ బాస్ కార్యక్రమంలో చివరి వారం వరకు కొనసాగారు. బిగ్ బాస్ కార్యక్రమం తర్వాత తిరిగి సీరియల్స్ లో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఇకపోతే ఈమె నిజజీవితంలో ఎంతో విషాదం ఉన్న సంగతి మనకు తెలిసిందే.కీర్తి కుటుంబ సభ్యులందరూ రోడ్డు ప్రమాదంలో మరణించారు .తాను ఒకటే బ్రతికి బయటపడ్డానని ఈమె బిగ్ బాస్ కార్యక్రమంలో తెలియజేశారు. ఇలా ప్రమాదం నుంచి బ్రతికినటువంటి కీర్తి ఈ ప్రమాదంలో అమ్మ అయ్యే అదృష్టాన్ని కూడా కోల్పోయారు. ఇలా తన జీవితంలో జరిగిన విషాద ఘటనను తలుచుకొని ఒంటరిగా కుమిలిపోతున్న ఆమె జీవితంలోకి నటుడు విజయ కార్తీక్ రాబోతున్నారని ఈమె ఓ బుల్లితెర కార్యక్రమంలో భాగంగా తనకు కాబోయే భర్త గురించి తెలియజేశారు.

తనకు (Keerthi Bhat) పిల్లలు పుట్టరని తెలసినా కూడా తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చారు అంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. ఈ కార్యక్రమంలో కార్తీక్ తండ్రి మాట్లాడుతూ తానే మాకు చిన్నపిల్ల అవసరమైతే పిల్లలని దత్తత తీసుకుంటామంటూ గొప్ప మనసు చాటుకున్నారు. ఇలా ఈ కార్యక్రమంలో భాగంగా వీరిద్దరు దండలు మార్చుకున్న విషయం మనకు తెలిసిందే. అయితే త్వరలోనే వీరిద్దరూపెళ్లి చేసుకోబోతున్నారని ఈ క్రమంలోనే నిశ్చితార్థ వేడుకను కూడా ఎంతో ఘనంగా జరుపుకోబోతున్నట్టు తెలుస్తుంది.

ఈ క్రమంలోనే తనకు కాబోయే భర్తతో కలిసి ఈమె నిశ్చితార్థానికి అందరిని ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా జానకి కలగనలేదు షూటింగ్ లోకేషన్ లోకి వెళ్లి అక్కడ ప్రియాంక జైన్ అమర్ దీప్ వంటి వారందరికీ స్వయంగా ఇన్విటేషన్ ఇచ్చి మరి ఆహ్వానించారు. వీరి నిశ్చితార్థం ఆగస్టు 20 బేగంపేట్ లో జరగబోతున్నట్టు ప్రియాంక వీరి నిచ్చితార్థపు తేదీని ప్రకటించారు. ఇది తెలిసిన నేటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus