Bigg Boss Telugu 6: ఊహించని పార్టిసిపెంట్స్ ని నామినేట్ చేసిన హౌస్ మేట్స్..!

బిగ్ బాస్ హౌస్ లో రెండోవారం నామినేషన్స్ లో పార్టిసిపెంట్స్ లాజిక్స్ మాట్లాడుతూ ఒక్కొక్కరు ఒక్కరిన్ని నామినేట్ చేశారు. అయితే, పార్టిసిపెంట్స్ లో కొన్ని నామినేషన్స్ అందరూ గెస్ చేసినా కూడా కొన్నింటిని మాత్రం గెస్ చేయలేకపోయారు. ఊహించని నామినేషన్స్ ఈసారి జరిగాయి. ఈసారి హౌస్ లో ఏకంగా 8మంది నామినేట్ అయ్యారు. రాజశేఖర్, షానీ, అభినయశ్రీ, ఫైమా, రోహిత్ – మెరీనా కపుల్, ఆదిరెడ్డి, గీతురాయల్ , ఇంకా రేవంత్ లు నామినేట్ అయ్యారు.

ఇక్కడే రేవంత్ ని గీతుని హౌస్ మేట్స్ ఎక్కువగా టార్గెట్ చేసి ఓట్లు వేశారు. అయితే, వాసంతీ కృష్ణన్ ఫైమాని కేవలం ఒకే ఒక ఓటుతో నామినేట్ చేసింది. నేను చూస్తున్నప్పుడు నవ్వడం లేదని, గత రెండురోజులుగా నాతో సరిగ్గా లేవంటూ రీజన్ చెప్పింది. అలాగే, షానీ కూడా అభినయశ్రీని తనని నామినేట్ చేసిందని, గేమ్ సరిగ్గా ఆడట్లేదని అన్నదని ఒకే ఒక ఓటుతో నామినేట్ చేశాడు. ఇలాగే రాజశేఖర్ కూడా కెప్టెన్ కి ఇచ్చిన స్పెషల్ పవర్ వల్ల బలైపోయాడు. బాలాదిత్య నామినేట్ చేశాడు.

ఇక రేవంత్ ని, గీతుని హౌస్ లో మెజరిటీ పార్టిసిపెంట్స్ నామినేట్ చేశారు. ఇద్దరూ మార్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని, ముఖ్యంగా గీతు బిహేవియర్ మార్చుకోమని చెప్పి మరీ నామినేట్ చేశారు. ఒక్కసారి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో చూసినట్లయితే., ఆరోహి – ఆదిరెడ్డి ని , ఆదిరెడ్డి – రోహిత్ – మెరినా కపుల్ ని, రోహిత్ – మెరీనా కపుల్ – ఆదిరెడ్డిని గీతు – రేవంత్ , రేవంత్ – గీతు ని, చంటి – గీతుని, సుదీప – గీతుని , నేహా – గీతుని, రాజశేఖర్ – రేవంత్ ని , ఆరోహి – ఆదిరెడ్డిని , ఆర్జే సూర్య – గీతుని, ఇనయ – ఆదిరెడ్డిని నామినేట్ చేసుకున్నారు.

ఇక్కడ ఎవరూ ఊహించని నామినేషన్స్ అంటే అది షానినే, షానిని ఆభినయశ్రీ ఇంకా శ్రీసత్యలు నామినేట్ చేశారు. అస్సలు కోపం రావట్లేదని, ఇంకా ముసుగులోనే గేమ్ ఆడుతూ సేఫ్ గా ఉన్నావేమో అనిపిస్తోందని షాక్ ఇస్తూ నామినేట్ చేశారు. అలాగే, రాజశేఖర్ రేవంత్ ని నామినేట్ చేస్తూ షాక్ ఇచ్చాడు. బాలాదిత్యకి స్పెషల్ గా ఇద్దరిని నామినేట్ చేయాల్సిన పవర్ వచ్చింది. దీంతో షానీని ఇంకా రాజశేఖర్ ని నామినేట్ చేశాడు.

మొత్తానికి రెండోవారం పార్టిసిపెంట్స్ లాజిక్స్ వర్కౌట్ చేస్తూ హౌస్ మేట్స్ తప్పులని బయటపెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రేవంత్, గీతులకి ఎక్కువగా ఓట్లు పడ్డాయి. మరి వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరం. అదీ విషయం.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus