Suriya: సూర్యపై బీజేపీ ఫైర్.. ట్రోల్ చేస్తోన్న ఫ్యాన్స్!

హీరో సూర్య వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి వ్యక్తిని బీజేపీ ఇప్పుడు టార్గెట్ చేసింది. కేంద్రప్రభుత్వం జారీ చేసిన నీట్ ఎగ్జామ్స్ కు, తమిళనాడులో హిందీని తప్పనిసరి చేయాలంటూ విధించిన రూల్స్ కు వ్యతిరేకంగా గళం ఎత్తినప్పటి నుంచి బీజేపీ పార్టీ నాయకులు సూర్యను టార్గెట్ చేస్తూ వచ్చారు. తాజాగా సూర్య నటించిన ‘జై భీమ్’ సినిమా విషయంలో బీజేపీ తమిళనాడుకి చెందిన జాతీయ కార్యదర్శి హెచ్.రాజా.. సూర్యపై విమర్శలు చేశారు.

మాకు మూడు భాషలను అక్కర్లేదని చెప్పిన హీరో సూర్య ఇప్పుడు తన ‘జై భీమ్’సినిమాను ఐదు భాషల్లో విడుదల చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇలాంటి స్వార్థపరులను ఎలా అర్థం చేసుకోవాలంటూ హెచ్‌. రాజా నిల‌దీయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక్కడ విషయం ఏంటంటే.. ఈ ట్వీట్ ను హీరో సూర్య లైక్ చేశారు. అయితే సూర్య ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో బీజేపీ నాయకుడిపై మండిపడుతున్నారు. సినిమాలోని అణ‌చివేత‌దారుల్లో త‌మ‌ను బీజేపీ నేత‌లు చూసుకుంటున్న‌ట్టుగా ఉంద‌ని కామెంట్స్ చేస్తున్నారు.

రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. సెలబ్రిటీలు సైతం ఈ సినిమా బాగుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను త‌మిళ‌నాడు క‌డ‌లూరులో జరిగిన ఓ యథార్థ ఘ‌ట‌న‌ను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus