బర్నింగ్ ఇష్యూని టచ్ చేసిన శేఖర్ కమ్ముల!

ఈ మధ్యకాలంలో చాలా మంది దర్శకుడు కొత్త పాయింట్లతో సినిమాలు తీస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాలో ఓ కొత్త పాయింట్ ను తీసుకొని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేలా తెరకెక్కించాడు దర్శకుడు. అలానే ‘చావు కబురు చల్లగా’ సినిమాలో తల్లీ, కొడుకులు మందు కొట్టడం.. తల్లికి వేరే వ్యక్తితో సంబంధం ఉండడం లాంటి బోల్డ్ విషయాలను చూపించారు. ఇప్పుడు దర్శకుడు శేఖర్ కమ్ముల కూడా తన సినిమాలో బోల్డ్ ఎలిమెంట్ ని టచ్ చేసినట్లు సమాచారం. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల ‘లవ్ స్టోరీ’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకే ప్రమోషన్ కార్యక్రమాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సినిమాలో పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు. ‘సారంగ దరియా’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ పాట సినిమాపై బజ్ ని పెంచేసింది. అలానే రీసెంట్ గా సినిమాలో డ్యూయెట్ సాంగ్ ని విడుదల చేశారు. దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో శేఖర్ కమ్ముల చాలా కాలంగా బర్నింగ్ టాపిక్ గా ఉన్న ఓ పాయింట్ ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రతీ అమ్మాయి యవ్వన దశలో ఎదుర్కొనే సమస్యను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇప్పటివరకు ఈ కాన్సెప్ట్ తో తెలుగులో సినిమాలు రాలేదు. కేవలం కొన్ని యాడ్స్ లో మాత్రమే చూపించారు. ఈ పాయింట్ ని వెండితెరపై జనాలను అర్ధమయ్యేలా చెప్పాలనుకున్నాడు శేఖర్ కమ్ముల. అతడి నేరేషన్ పై ప్రేక్షకులను నమ్మకం ఉండడంతో ఈ పాయింట్ ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారని బలంగా నమ్ముతోంది యూనిట్.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus