గతేడాది ‘అఖండ’తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌తో కెరీర్‌లో హయ్యస్ట్ కలెక్షన్స్ రాబట్టాడు బాలయ్య.. సరైన సినిమా పడితే ఎలా ఉంటుందో బాక్సాఫీస్ బరిలో తన సింహగర్జన ద్వారా చూపించడమే కాక.. పాండమిక్ తర్వాత ప్రేక్షకులు పెద్ద ఎత్తున థియేటర్లకొచ్చేాలా చేసి.. విడుదల వాయిదాలతో సతమతమవుతున్న తెలుగు చిత్రసీమకి సరికొత్త ఊపునీ, ఉత్సాహాన్నీ ఇచ్చారు.. సినిమాలు, రాజకీయాలు, క్యాన్సర్ హాస్పిట్ ద్వారా సేవాకార్యక్రమాలు, టాక్ షో.. ఇప్పుడు కొత్తగా బ్రాండ్ అంబాసిడర్.. 62 ఏళ్ల వయసులోనూ+ 30 ఎనర్జీతో పనిచేస్తున్నారు..
యంగ్ డైరెక్టర్స్‌తో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైనప్ చేస్తున్న నటసింహ.. గోపిచంద్ మలినేని దర్శకత్వలంలో, మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ‘వీర సింహా రెడ్డి – గాడ్ ఆఫ్ మాసెస్’ షూటింగుకి డిసెంబర్ మధ్యలో గుమ్మడికాయ కొట్టబోతున్నారు. తన 108వ సినిమాని వరుసగా డబుల్ హ్యాట్రిక్ కొట్టిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఫుల్ స్వింగ్‌లో ప్రీ ప్రొడక్సన్ వర్క్ కంప్లీట్ చేస్తోంది టీమ్..
వీలైనంత వరకు నవంబర్ చివర్లో.. లేదంటే డిసెంబర్‌లో కొబ్బరికాయ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అనిల్ ఇందులో బాలయ్య బాబుని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్.. అవతార్‌లో చూపించబోతున్నాడని టాక్.. ఏజ్డ్ క్యారెక్టర్లో కనిపించబోయే బాలయ్యకి ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీల కూతురిగా కనిపించనుంది.. విలన్‌గా ఓ పాపులర్ బాలీవుడ్ యాక్టర్ నటిస్తారని కొద్దిరోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి..
లేటెస్ట్ సాలిడ్ అప్‌డేట్ ఏంటంటే.. NBK 108లో ప్రముఖ హిందీ కథానాయకుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడి పాత్రకు ఫిక్స్ అయ్యారు.. ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.. అర్జున్ హీరోగానే కాకుండా.. షారుఖ్ ఖాన్ ‘రా.వన్’, ‘ఓం శాంతి ఓం’ సినిమాల్లో నెగెటివ్ క్యారెక్టర్లలో అదరగొట్టేశాడు.. అలాంటి యాక్టర్, బాలయ్య లాంటి సీనియర్ అండ్ మాస్ స్టార్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటే.. అనిల్ ఈ క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుంటాడో అర్థం చేసుకోవచ్చు..
యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?
‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!