‘సాహో’ సినిమా బాలీవుడ్లో హిట్టయ్యింది. అక్కడ ఏకంగా 130 కోట్ల వరకూ వసూల్ చేసి తెలుగు సినిమా సత్తా ఏంటనేది మరోసారి రుచి చూపించింది. దీంతో ‘సైరా’ సినిమా కూడా అక్కడ పెద్ద హిట్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. అందులోనూ ‘సైరా’ ను ఫరాన్ అక్తర్ రిలీజ్ చేస్తున్నాడు.. కంటెంట్ బాగా నచ్చితేనే కానీ ఆయన ఇలా రిలీజ్ చేయడానికి ముందుకు రాడు. ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు సినిమాలు లేక.. ఉసూరు మంటూ ఉన్నారు. దీంతో తెలుగు సినిమాల కథల్ని రీమేక్ చేసుకోవడానికి అక్కడి నిర్మాతలు ఎగ పడుతున్నారు. ఇప్పటికే ‘ఎఫ్2’ ‘జెర్సీ’ ‘డియర్ కామ్రేడ్’ వంటి చిత్రాల్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు యూట్యూబ్ లో మన సినిమాల్ని డబ్బింగ్ చేస్తే 100 మిలియన్ల వరకూ వ్యూస్ వచ్చేస్తున్నాయి. దీంతో అక్కడ సినిమాలు చేసి క్యాష్ చేసుకోవాలని మన హీరోలు కూడా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
ఈ లిస్ట్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముందున్నాడని తెలుస్తుంది. బన్నీ నటించిన ‘సరైనోడు’ ‘డిజె’ చిత్రాల హిందీలో డబ్బింగ్ చేసి యూట్యూబ్ లో విడుదల చేస్తే 100 మిలియన్ల పైనే వ్యూస్ వచ్చాయి. దీంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నాడట. సమయం దొరుకినప్పుడల్లా ముంబైకి వెళ్ళి అక్కడి దర్శకనిర్మాతలతో మీటింగ్లు పెడుతున్నాడట. బాలీవుడ్ లో తన డెబ్యూ కోసం తెగ ప్రయత్నిస్తున్నాడట. అన్నీ కుదిరితే అల్లు అర్జున్ నుండీ బాలీవుడ్ ఎంట్రీ చేసే అవకాశం ఉంటుందట. తెలుగుతో పాటు బన్నీకి మలయాళం మార్కెట్ ఎలాగు ఉంది ఇప్పుడు హిందీ భాషపై కూడా కన్నేశాడని తెలుస్తుంది.