రాజమౌళిని కట్టడి చేయడానికి బాలీవుడ్ ప్లాన్స్?

బాహుబలి సినిమా బాలీవుడ్ లో అద్భుతమే చేసింది. తెలుగువారు తెరకెక్కించిన బాహుబలి హిందీ సినిమాల రికార్డ్స్ మొత్తం తుడిచిపెట్టింది.బాహుబలి 2 హిందీ వర్షన్ రికార్డు వసూళ్లతో ఆల్ టైం టాప్ గ్రాసర్ గా నిలిచింది. అప్పటి వరకు అమీర్ ఖాన్ దంగల్ పేరిట ఉన్న రికార్డుని చెరిపివేసింది. ఆ తరువాత బాహుబలి2 రికార్డుని బద్దలు కొట్టాలని కొన్ని భారీ చిత్రాలు వచ్చినా దాని అంచులలోకి కూడా వెళ్లలేక పోయాయి. దీనితో బాలీవుడ్ హీరోల ఇగో హర్ట్ అయ్యింది. అప్పట్లో బాహుబలి వసూళ్ల ప్రభంజనం కొనసాగుతున్నా, ప్రముఖ నటులు కనీసం స్పందించలేదు.

కొందరు ఈ సినిమా చూడలేదు అని తప్పించుకున్నారు. ఏదేమైనా బాహుబలి విజయం బాలీవుడ్ ప్రముఖుల ఇగోని హర్ట్ చేసింది. దీనితో రాజమౌళి నుండి వస్తున్న మరో చిత్రం ఆర్ ఆర్ ఆర్ పై వీరు కన్నేశారు. ఎలాగైనా దీని విజయాన్ని అడ్డుకోవాలని వారు ప్రణాళికలు వేస్తున్నారని టాక్. బాహుబలి తర్వాత ప్రభాస్ నుండి వచ్చిన సాహో సినిమాకు బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్స్ తరణ్ ఆదర్శ్, రాజీవ్ మసంద్ వంటి వారు దారుణమైన రేటింగ్స్ ఇచ్చారు.

ఐతే వారి రేటింగ్స్ కి భారీ వసూళ్లతో ఆ సినిమా షాక్ ఇచ్చింది. ఆతరహా ప్లాన్స్ తో బాలీవుడ్ ఆర్ ఆర్ ఆర్ విజయాన్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. బాహుబలి సినిమాను ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ డిస్ట్రిబ్యూట్ చేశారు. అది బాహుబలి కి చాలా కలిసొచ్చిన అంశం. ఈసారి ఆర్ ఆర్ ఆర్ హిందీ వర్షన్ హీరో అజయ్ దేవ్ గణ్ డిస్ట్రిబ్యూట్ చేయనున్నాడు. మరి ఆయన ఎంత వరకు సక్సెస్ ఫుల్ గా ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళతారో చూడాలి. ఐతే వారు ఎన్ని ప్లాన్స్ వేసినా సినిమాలో విషయం ఉంటే ఎవరు ఆపలేరు.

Most Recommended Video

అతి తక్కువ వయసులో లోకం విడిచిన తారలు
అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన తెలుగు సినిమాలు…!
‘మహానటి’ లోని మనం చూడని సావిత్రి, కీర్తి సురేష్ ల ఫోటోలు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus