ఆ ఐపీఓతో అదరగొట్టిన బాలీవుడ్‌ భామలు

స్టాక్‌ మార్కెట్‌ గురించి అవగాహన ఉన్నవారికి… నైకా ఐపీఓ గురించి తెలిసే ఉంటుంది. బ్యూటీ ప్రోడక్ట్స్‌ను సంస్థ అయిన నైకా… ఇటీవల ఐపీఓకి వచ్చింది. ఫాల్గుణీ నాయర్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ సంస్థ ఐపీఓ భారీ స్థాయిలో లిస్టింగ్‌ అయ్యింది. సుమారుగా నైకా షేర్‌ వాల్యూ డబుల్‌ అయ్యి కూర్చుంది. దీని వల్ల ఆ సంస్థ, అందులో షేర్లుకొన్నవాళ్లు కూడా మంచి ఆదాయం పొందారు. అలా లాభం పొందినవారిలో బాలీవుడ్‌ నటీమణులు కట్రినా కైఫ్‌, అలియా భట్‌ కూడా ఉన్నారు.

ఐపీఓకు ముందే నైకాలో కట్రినా కైఫ్‌, అలియా భట్‌ పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు ఐపీఓ వల్ల పది రెట్లకుపైగా లాభాలు సంపాదించారట. 2018లో కట్రినా ₹రెండు కోట్లతో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టింది. అలియా భట్​ అయితే సుమారు ₹ఐదు కోట్ల వరకు పెట్టుబడి పెట్టింది. నైకా ఐపీఓ ఇప్పుడు బంపర్‌ హిట్‌ కొట్టడంతో వీరిద్దరి వాటాల విలువ ఒక్క రోజులోనే 10 రెట్లుకు పైగా వృద్ధి చెందింది. కట్రినా పెట్టుబడి విలువ ₹22 కోట్లకు చేరుకుంది.

ఇక ఆలియా పెట్టుబడి విలువ ఏకంగా ₹5కోట్ల నుండి రూ.55 కోట్లకు పెరిగింది అని సమాచారం. దీంతో ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు నటనలోనే కాదు స్టాక్​మార్కెట్​లోనూ జోరు చూపించినట్లయింది. కెరీర్‌ను ఎంత పక్కాగా ప్లాన్‌ చేసుకుంటున్నారో, ఇలా వ్యాపారంలోనూ అంతే పక్కగా ప్లానింగ్‌లో ఉన్నారు కట్రినా, అలియా భట్‌.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus