ప్రభాస్ నిర్మాతలకు షాక్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్..!

ప్రభాస్ ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్లో ఓ చిత్రం చేయబోతున్నాడు. దీనికి ఇంకా టైటిల్ ఫిక్స్ చెయ్యలేదు. ‘ఓ డియర్’ ‘రాధే శ్యామ్’ వంటి టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. ‘యూవీ క్రియేషన్స్’ మరియు ‘గోపికృష్ణ మూవీస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే.. ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యడానికి రెడీ అయ్యాడు. ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు.

ఇది ఓ సోషియో ఫాంటసీ చిత్రమని.. సూపర్ పవర్స్ ఉన్న హీరోగా ప్రభాస్ కనిపించనున్నాడు అని తెలుస్తుంది. స్క్రిప్ట్ ఆల్రెడీ పూర్తయిపోయింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు పెట్టేసాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా ఓ బాలీవుడ్ నటిని సంప్రదిస్తే ఏకంగా 15 కోట్లు డిమాండ్ చేసిందట. ఆమె ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకోణె. సంజయ్ లీల భన్సాలీ డైరెక్షన్లో చేసిన ‘భాజీరావ్ మస్తానీ’ ‘పద్మావత్’ వంటి చిత్రాలు బ్లాక్ బస్టర్ లు అవ్వడంతో.. అప్పటి నుండీ ఒక్కో సినిమాకు 15 కోట్లు డిమాండ్ చేస్తుందట.

‘ఛపాక్’ చిత్రం ప్లాప్ అయినా ఈమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది. అందుకే ప్రభాస్ సినిమాకి ఈమె 15 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో నిర్మాత అశ్వినీదత్ ఒక్కసారిగా షాక్ అయ్యారని. దీంతో నాగ్ అశ్విన్ కియారా అద్వానీని తీసుకుందాం అని చెప్పాడట. ఆమెను సంప్రదించగా.. ఇప్పుడున్న ప్రాజెక్ట్ లను ఫినిష్ చెయ్యడానికి టైం పడుతుందని .. ఆ తర్వాత ప్రభాస్ ప్రాజెక్ట్ చెయ్యడానికి రెడీ అని చెప్పిందట. ఎలాగూ ప్రభాస్ రాధా కృష్ణకుమార్ ప్రాజెక్ట్ ఫినిష్ అయ్యే వరకూ కనీసం 9 నెలల టైం పడుతుంది కాబట్టి.. నాగ్ అశ్విన్, అశ్వినీదత్ లు ఓకే చెప్పినట్టు సమాచారం.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus