కొన్నేళ్ల క్రితం రామ్ చరణ్ జంజీర్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడంతో పాటు రామ్ చరణ్ నటనపై విమర్శలు రావడానికి కారణమైంది. రామ్ చరణ్ నటనపై నెగిటివ్ కామెంట్లు రాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో చరణ్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి ఈ సినిమాతో ఘనవిజయం సాధించారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ నటన చూసి బాలీవుడ్ ఆడియన్స్, క్రిటిక్స్ సైతం ఆశ్చర్యానికి గురయ్యారు.
ఆర్ఆర్ఆర్ సినిమా చివరి 20 నిమిషాలలో చరణ్ నటన ఆడియన్స్ ఆశ్చర్యపోయేలా ఉంది. అల్లూరి సీతారామరాజు గెటప్ లో చరణ్ కనిపించింది కొన్ని నిమిషాలే అయినా తన నటనతో ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేశారు. అయితే తాజాగా చరణ్ తో పని చేయాలని ఉందని హిందీ లెజెండ్ డైరెక్టర్స్ ట్వీట్ చేశారు. హిందీ డైరెక్టర్లు చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హిందీలో దిగ్గజ దర్శకద్వయంగా పాపులారిటీని సంపాదించుకున్న అబ్బాస్ మస్తాన్ తాజాగా హీరో రామ్ చరణ్ తో ఫోటో దిగారు.
ఆ ఫోటోను వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు తమకు రామ్ చరణ్ తో కలిసి పని చేయాలని ఉందని భవిష్యత్తులో ఆ ఛాన్స్ రావాలని కోరుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అబ్బాస్ మస్తాన్ డైరెక్షన్ లో హిందీలో తెరకెక్కిన పలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మరోవైపు ఆర్ఆర్ఆర్ మూవీ కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.
ఫుల్ రన్ లో ఈ సినిమా మరికొన్ని రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కేజీఎఫ్2 సినిమా విడుదలయ్యే వరకు ఆర్ఆర్ఆర్ సినిమాకు పోటీనిచ్చే సినిమా లేదనే చెప్పాలి. ఆర్ఆర్ఆర్ కలెక్షన్ల విషయంలో చరణ్, తారక్ అభిమానులు సంతోషంగా ఉన్నారు.