ఒకే రోజు 2 పెద్ద సినిమాలు రిలీజ్ చేస్తున్నారు.. కానీ..!

అగ్ర నిర్మాణ సంస్థ ‘మైత్రి మూవీ మేకర్స్’ నుండి నెలకో సినిమా రిలీజ్ అవుతుంటుంది. అయితే పెద్ద సినిమా.. లేదంటే వాళ్ళ చిన్న సినిమా అదీ కాదు అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్న డబ్బింగ్ సినిమా.. ఇలా ఏదో ఒక ప్రాజెక్టుతో ఆడియన్స్ ను పలకరిస్తూనే ఉంటారు ‘మైత్రి’ అధినేతలు అయిన రవి శంకర్(Y .Ravi Shankar), శశి,  నవీన్ ఎర్నేని (Naveen Yerneni)…లు..! టాలీవుడ్లో ఇప్పుడు లీడింగ్లో ఉన్న సంస్థ ఇదే అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఇదే బ్యానర్ నుండి ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.

Jaat, Good Bad Ugly

Box-office war between Jaat and Good Bad Ugly

అవి కూడా పరభాషా స్టార్ హీరోలతో చేసిన పెద్ద సినిమాలు కావడం విశేషంగా చెప్పుకోవాలి. కాకపోతే వీటి రిలీజ్..లతో వీళ్ళకి పెద్ద ఇబ్బందులు వచ్చి పడినట్టు స్పష్టమవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అజిత్ (Ajith Kumar) హీరోగా తెరకెక్కిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) తో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతోంది ‘మైత్రి’ సంస్థ. అలాగే సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా తెరకెక్కిన ‘జాట్’ తో (Jaat) బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతుంది. అయితే ఈ 2 సినిమాలు ఏప్రిల్ 10నే రిలీజ్ అని ప్రకటించారు.

‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సంగతి ఓకే. అజిత్ కి ఉన్న స్టార్ ఇమేజ్ ని బట్టి.. ప్రమోషన్స్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ వచ్చేస్తాయి. కానీ ‘జాట్’ కి అలా కాదు. దాన్ని బాలీవుడ్లో కరెక్ట్ గా ప్రమోట్ చేయాలి. లేదు అంటే ఓపెనింగ్స్ రావడం కష్టం. అందుకే ‘మైత్రి’ సంస్థపై ప్రెజర్ పడింది. గతంలో ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా ప్రమోషన్స్ టైంలో కూడా ‘మైత్రి’ వారు ఇలాగే ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

తమన్నా కోసం హెబ్బా పటేల్ ని తక్కువ చేస్తున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus