Boyapati Srinu,Balakrishna: బాలయ్య సినిమాల గురించి బోయపాటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు హీరోల కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంటుంది. అలాంటి కాంబినేషన్లో బోయపాటి శ్రీను బాలకృష్ణ కాంబినేషన్ ఒకటి అని చెప్పాలి. వీరిద్దరి కాంబినేషన్లో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అంటే ఆ సినిమాలో బ్లాక్ బాస్టర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ మూడు సినిమాలలో నటించారు. ఈ మూడు సినిమాల్లో కూడా ఇండస్ట్రీలో సంచలనమైన విజయాన్ని అందుకున్నాయి.

వీరిద్దరి కాంబినేషన్లో మొదటిసారి సింహా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అనంతరం లెజెండ్ అఖండ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నాయి. ఇకపోతే తాజాగా బోయపాటి శ్రీను రామ్ హీరోగా నటించిన స్కంద సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సినిమా ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చి మిశ్రమ స్పందన అందుకుంది.

ఈ క్రమంలోనే బోయపాటి (Boyapati Srinu) ఇతర చిత్ర బృందం పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బోయపాటి శ్రీను బాలకృష్ణ గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ గారితో నేను సినిమా చేస్తున్నాను అంటే ఆయన కనీసం కథ కూడా వినరని బోయపాటి తెలియజేశారు.

కథ వినండి సర్ అని నేను చెప్పినప్పటికీ డైరెక్టర్ మీరు కదా వినాల్సిన పని లేదు అంటారు. ఇలా నా డైరెక్షన్ లో వచ్చే సినిమా కథలను కూడా బాలకృష్ణ గారు వినరని సినిమా మొత్తం అయిపోయిన తరువాతనే ఆయన సినిమా ఎలా వచ్చింది అనేది చూస్తారు అంటూ ఈ సందర్భంగా బోయపాటి శ్రీను చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక అఖండ సీక్వెల్ గురించి కూడా మాట్లాడుతూ తప్పకుండా ఈ సినిమాకి సీక్వెల్ చిత్రం వస్తుందని తెలియజేశారు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus