NBK107 లుక్‌ మాత్రమేనా సినిమా కూడా అంతేనా?

తెల్ల డ్రెస్‌… ముఖాన కోపం.. చేతిలో కత్తి అయితే అది కొంచెం కొత్తగా ఉంటుంది. బాలయ్యను ఇలాంటి లుక్‌లో మీరు చూశారా? ఎందుకు చూడలేదు చాలాసార్లు చూశాం, బోయపాటి శ్రీను బాలయ్యను అలానే ఎక్కువ చూపిస్తారుగా అంటారా? అయితే ఇప్పుడు అలాంటి లుక్కే మరొకటి వచ్చింది. అయితే ఈసారి అది బోయపాటి – బాలయ్య నుండి కాదు, బాలయ్య – మలినేని నుండి. ఈ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన లుక్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది.

పెద్దాయన నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా బాలయ్య సినిమాల అప్‌డేట్స్‌ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ‘హంట్‌ బిగిన్స్‌’ అంటూ ఓ లుక్‌ రిలీజ్‌ చేశారు మైత్రీ మూవీ మేకర్స్‌ టీమ్‌. బాలయ్య 107వ సినిమా నిర్మిస్తోంది వాళ్లే కదా. అందులోనే మేం పైన చెప్పిన బాలయ్య లుక్‌ ఉంది. తెల్ల పంచె చొక్కా, చేతిలో పొడవాటి కత్తి, చుట్టూరా దుమ్ము, ముఖాన బాలయ్య మార్క్‌ యాంగ్రీ ఎక్స్‌ప్రెషన్ కనిపించాయి.

దీంతో ఒక్క నిమిషం పాటు ఇది బాలయ్య – బోయపాటి సినిమా లుక్కా లేక గోపీచంద్‌ మలినేని సినిమా లుక్క అని ప్రేక్షకులు అనుకున్నారు. ఎందుకంటే అంతలా బోయపాటి వర్క్‌ను ఓవర్‌లాప్‌ చేసింది ఆ లుక్‌. బాలయ్యను బోయపాటి ఎప్పుడూ ఇలానే చూపించారు, చూపిస్తారు కూడా. దీంతో ప్రేక్షకులు మలినేనిని పూని బోయపాటి అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమా గురించి చూస్తే ఇందులో ఎప్పటిలాగే ఇద్దరు బాలయ్యలు ఉంటారట.

ఒక బాలయ్య ఓ ప్రాంతాన్ని శాసించే మంచి వ్యక్తిగా కనిపిస్తే, ఇంకో బాలయ్య ఆ ఊరుకి దూరంగా సిటీలో పెరిగే ఓ ఉద్యోగిగా కనిపిస్తారు. సిటీ బాలయ్య కథ ఊరికి ఎందుకొచ్చింది, ఊరిలో గతంలో ఏం జరిగింది అనేదే కథ. దానికి మలినేని స్టైల్‌ స్క్రీన్‌ప్లే ఉంటుంది అంటున్నారు. ఈ సినిమాకు తొలుత ‘అన్న గారు’ అనే పేరు అనుకున్నారట. ఆ తర్వాత ‘జై బాలయ్య’ అనే పేరుకు మారినట్లు తెలుస్తోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus