చరణ్ వలే బాలయ్యను కూడా ట్రోల్స్ చెయ్యకూడదని..!

ప్రస్తుతం బాలయ్య టైం ఏమి బాగోలేదు. ఆయనకు 2019 భయంకరమైన షాక్స్ ఇచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకొని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బియోపిక్స్ ఘోర పరాభవాన్ని చవిచూశాయి. ఆ మూవీస్ బాలయ్య కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ఇక అదే ఏడాది చివర్లో వచ్చిన రూలర్ సైతం బాలయ్యకు మరో షాక్ ఇచ్చింది. ఇది కూడా కనీస వసూళ్లు దక్కించుకోలేక పోయింది. ఈ చిత్రాల పరాజయం తరువాత అసలు బాలయ్య మార్కెట్ పైనే అనుమానాలు రేగాయి.

బాలయ్య మార్కెట్ పూర్తిగా దెబ్బతిందని అందరూ అనుకున్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ సైతం నిరాశలో కూరుకుపోయారు. అందుకే బాలయ్య కలిసొచ్చిన బోయపాటితో జట్టు కట్టారు. వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రానుంది. ఐతే బాలయ్య హీరోయిజం, ఫైట్ సీన్స్ పై విమర్శలు ఎక్కువైపోయాయి. ప్రస్తుత జెనరేషన్ ఏదైనా వాస్తవానికి దూరంగా ఉంటే అసలు ఇష్టపడడం లేదు. హీరోయిజం కోసం విలన్స్ ని ఇష్టం వచ్చినట్లు గాల్లో ఎగరేస్తే వారిని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

Boyapati Srinu taking special care over Balayya Babu1

ఇక బోయపాటి గత చిత్రం వినయ విధేయ రామ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ముఖ్యంగా తలకాయలు గద్దలు ఎత్తుకెళ్ళడం, విలన్ ని కాటేసిన పాము చనిపోవడం వంటివి సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ కి గురయ్యాయి. అందుకే బాలయ్య యాక్షన్ సన్నివేశాలు విషయంలో చాల జాగ్రత్తగా తెరకెక్కించాలని భావిస్తున్నాడని తెలుస్తుంది. అలాగే ఫైట్స్ కొంచెం వాస్తవికంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట. మరి చూడాలి బాలయ్యకు బోయపాటి అయినా హిట్ ఇస్తాడేమో.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus