Boys Hostel OTT: ఓటీటీకి ‘బాయ్స్ హాస్టల్’ కానీ ..!

గత నెలలో కన్నడలో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది ‘హాస్టల్ హుదుగురు బెకగిద్దారే’. తెలుగులో గతవారం ఈ మూవీ ‘బాయ్స్ హాస్టల్’ పేరుతో రిలీజ్ అయ్యింది. ‘చాయ్ బిస్కట్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఆగస్టు 26 న ఈ చిత్రం రిలీజ్ అవ్వడం జరిగింది. మొదటి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే ఇది ఒక టిపికల్ అటెంప్ట్ అని సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పుకొచ్చారు.మేకింగ్ మొత్తం కొత్తగా ఉందని..

గతంలో ఎప్పుడూ ఇలాంటి అటెంప్ట్ చూడలేదు అని కూడా సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేశారు. ఇక ‘బాయ్స్ హాస్టల్’ సినిమా బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ కొంతవరకు బాగానే ఉందని చెప్పాలి. అయితే ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ డేట్ బయటకు రావడం అందరికీ షాకిచ్చింది. విడుదలైన వారం రోజులకే ఓటీటీ రిలీజ్ డేట్ బయటకు రావడం ఏంటి? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు.

అయితే అసలు మేటర్ వేరు. సెప్టెంబర్ 1 న ‘బాయ్స్ హాస్టల్’ కన్నడ వెర్షన్ అయిన ‘హాస్టల్ హుదుగురు బెకగిద్దారే’ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు వెర్షన్ మాత్రం ఇంకాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ‘బాయ్స్ హాస్టల్’ మూవీ ఇంకా థియేటర్లలో రన్ అవుతుంది. పైగా తెలుగులో డిజిటల్ హక్కులు ఇంకా సేల్ అవ్వలేదు అని తెలుస్తుంది.

https://www.youtube.com/watch?v=d_qU7Fk3-L0

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags