టాలీవుడ్ వెటరన్ కమెడియన్ బ్రహ్మానందం (Brahmanandam) పేరు వింటేనే నవ్వులు విరబూస్తాయి. ఆయన తెరపై కనిపిస్తే చాలు, ఆడియన్స్‌కు పొట్ట చెక్కలవ్వడం కాయం. కానీ, రీసెంట్‌గా జరిగిన ఓ మీడియా మీట్‌లో బ్రహ్మానందం చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. రామ్ చరణ్ (Ram Charan) హీరోగా శంకర్ (Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’లో (Game Changer) బ్రహ్మానందం చిన్న పాత్రలో కనిపించడంపై ఓ విలేఖరి ప్రశ్నించగా.. ఆయన ఇచ్చిన రిప్లై మాత్రం సెన్సేషన్‌గా మారింది.
“గేమ్ ఛేంజర్ లాంటి పెద్ద మూవీలో మీరు చిన్న క్యారెక్టర్ చేయడం చూసి షాక్ అయ్యాం సార్” అని మీడియా పర్సన్ బ్రహ్మానందంని ఆటపట్టిస్తూ అడిగింది. వెంటనే బ్రహ్మానందం తనదైన శైలిలో కలుగజేసుకుని అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. “మీరు చూసింది చిన్న క్యారెక్టర్ కానీ నేను చేసింది పెద్ద క్యారెక్టర్” అంటూ పరోక్షంగానే శంకర్ టీమ్‌కు పంచ్ విసిరారు.
బ్రహ్మానందం మాటల్లోని అసలు మర్మం ఏమయ్యి ఉంటుంది? ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఆయన కనిపించింది కొద్దిసేపే.! అయినా, షూటింగ్ ఎక్కువ రోజులు చేసి ఉండొచ్చు. తర్వాత బ్రహ్మానందం పాత్రను సినిమాలో బాగా కత్తిరించి ఉండొచ్చు. లేదు అంటే బ్రహ్మానందం చేసింది కలెక్టర్ పాత్ర. కాబట్టి నా పాత్ర పెద్దది అని ఆ ఉద్దేశంతో చెప్పి ఉండొచ్చు.
ఏదేమైనా ఆయన చెప్పింది తెలివైన సమాదానం అనే చెప్పాలి.ఇక ‘గేమ్ ఛేంజర్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యిందనేది తెలిసిన విషయమే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.