Brahmanandam: రంగమార్తాండ సక్సెస్ బ్రహ్మానందాన్ని సత్కరించిన మెగా హీరోలు!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొన్ని వందల సినిమాలలో నటించి ఎంతో అద్భుతమైన గుర్తింపు పొందినటువంటి నటుడు బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే. కొన్ని సినిమాలు ఈయన వల్లే సూపర్ హిట్ అయ్యాయి అంటే అతిశయోక్తి లేదు. ఇలా కమెడియన్ గా అందరిని కడుపుబ్బా నవ్వించిన బ్రహ్మానందం ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించారు. వయసు పై పడటంతో ఈయన కేవలం ప్రాధాన్యత ఉన్న సినిమాలలో మాత్రమే నటిస్తున్నారు.

ఇలా ఇన్నేళ్ల తన సినీ కెరియర్లో కమెడియన్ గా నటిస్తూ అందరినీ ఎంతో నవ్వించిన బ్రహ్మానందం మొదటిసారి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తన నటనతో అందరికీ కన్నీళ్లు తెప్పించారు.కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన రగమార్తాండ సినిమాలో ఈయన ప్రకాష్ రాజు స్నేహితుడు సుబ్బు పాత్రలో నటించారు. ఈ పాత్రలో బ్రహ్మానందం నటన అద్భుతమని చెప్పాలి. ఈయన నటన చూసి కంటతడి పెట్టని ప్రేక్షకులంటూ లేరు.

ఇలా రంగమార్తాండ సినిమాలో తన నటనతో అందరికీ కన్నీళ్లు పెట్టించిన బ్రహ్మానందం గారిని తాజాగా మెగా హీరోలు సత్కరించారు.ఈ సినిమాలో బ్రహ్మానందం నటనపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించడమే కాకుండా ఇన్నేళ్లు అందరినీ నవ్వించిన బ్రహ్మానందం ఒకే ఒక్క సినిమాతో అందరికీ కన్నీళ్లు తెప్పించారంటూ ఆయన నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవితో పాటు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం బ్రహ్మానందం గారికి శాలువా కప్పి సత్కరించారు.

ఇక రంగమార్తాండ సినిమాలో ప్రకాష్ రాజ్ రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించారు. చాలా రోజుల తర్వాత కృష్ణవంశీ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విశ్లేషకుల నుంచి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రతి ఒక్కరూ రంగ మార్తాండ సినిమాని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ సినీ విశ్లేషకులు ఈ సినిమా గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారు. ఇక ప్రస్తుతం చిరంజీవి రామ్ చరణ్ బ్రహ్మానందం ముగ్గురు ఉన్నటువంటి ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus