మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి సుష్మితా సేన్ చాలా కాలంగా రోహ్మాన్ షాల్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. ఎప్పటికప్పుడు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తీసుకున్న ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ రచ్చ చేసింది సుష్మితా. రోహ్మాన్.. సుష్మితా పిల్లలతో కూడా కలిసిపోవడం, అందరూ కలిసి పార్టీలకు, ట్రిప్ లకు తిరగడంతో.. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే వార్త కూడా హల్చల్ చేసింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.
అంతేకాకుండా ఈ వార్తలకు బలం చేకూరుస్తూ సుష్మితా సేన్ సోషల్ మీడియాలో పలు పోస్ట్ లు పెడుతోంది. ”సమస్య ఎక్కడ వస్తుందంటే.. మగాడు మారతాడని ఆడది భావిస్తుంది కానీ అతడు మారడు. మగాడు చేసే మిస్టేక్ ఏంటంటే ఆడది అతడిని వదిలి వెళ్లలేదని అనుకుంటాడు. కానీ ఆమె వెళ్తుంది” అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఆమె పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అలానే తన తల్లి, కూతురుతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ఒకరికొకరం ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటామంటూ క్యాప్షన్ జోడించింది.
ఈ పోస్ట్ తో సుష్మితాకు రోహ్మాన్ తో నిజంగానే బ్రేకప్ అయిందంటూ కథనాలు వస్తున్నాయి. దీంతో ఆమె అభిమానులు కలవరపడుతున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన లేదు. సుష్మితా కంటే రోహ్మాన్ వయసులో పదిహేనేళ్లు చిన్నవాడు. సుష్మితా పేరుని రోహ్మాన్ టాటూ కూడా వేయించుకున్నాడు. ఇంత ప్రేమగా ఉన్న ఈ జంట ఇప్పుడు విడిపోవడానికి గల కారణాలు తెలియాల్సివున్నాయి.