సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా ఎంట్రీ ఇస్తూ ‘బబుల్ గమ్’ అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. ‘క్షణం’ ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి వైవిధ్యమైన సినిమాలతో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్న రవికాంత్ పేరేపు ఈ చిత్రానికి దర్శకుడు. మానస చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థతో కలిసి ‘మహేశ్వరి మూవీస్’ సంస్థ నిర్మించింది. టీజర్, ట్రైలర్స్, పాటలు వంటివి బాగానే అనిపించాయి.
దీంతో డిసెంబర్ 29 న రిలీజ్ అయిన ఈ సినిమా పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మొదటి రోజు ఈ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. వీకెండ్ ను కూడా ఈ మూవీ పెద్దగా వాడుకోలేదు. ఒకసారి 4 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :’
నైజాం
0.10 cr
సీడెడ్
0.05 cr
ఆంధ్ర(టోటల్)
0.08 cr
ఏపీ + తెలంగాణ
0.23 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్
0.05 cr
వరల్డ్ వైడ్ టోటల్
0.28 cr
‘బబుల్ గమ్’ (Bubblegum) చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.4.75 కోట్ల షేర్ ను రాబట్టాలి.4 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.0.40 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.35 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఒకపక్క పోటీగా ‘డెవిల్’ సినిమా,మరోపక్క ‘సలార్’ రెండో వీకెండ్లో స్ట్రాంగ్ గా రన్ అవ్వడంతో.. ‘బబుల్ గమ్’ వాటి పోటీని తట్టుకోలేకపోయింది అని చెప్పాలి.