సినిమా ఎలా ఉంది? సినిమా బాగుందా? సినిమా అదిరిపోయిందా? ఒకప్పుడు ఫస్ట్ షో అవ్వగానే.. ఆ నెక్స్ట్ షో కోసం లైన్‌లో నిల్చున్న వాళ్లు, లోపలకు వెళ్లడానికి రెడీగా ఉన్నవాళ్లు అడుగుతుండేవారు. ఇప్పుడు ఈ పరిస్థితి లేదనుకోండి. అయితే ‘ఉప్పెన’ (Uppena) సినిమా సమయంలో ఓ ఊరిలో ఓ పెద్దాయన థియేటర్ బయట నిలబడి అందరినీ ఇలా అడిగారట. వాళ్లు బాగుంది అనేసరికి ఆయన ముఖం వెలిగిపోయిందట. అలా అడిగిన సినిమా ‘ఉప్పెన’ అయితే..
ఆ అడిగిన పెద్దాయన ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు తండ్రి. కొడుకు తొలి సినిమా ఫలితం గురించి తెలుసుకున్న ఆ తండ్రి ఇటీవల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana). బ్రహ్మాజీ (Brahmaji) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘బాపు’ (Baapu) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కి బుచ్చిబాబు వచ్చారు. ఆ వేదిక మీదే ఈ విషయం చెప్పారు. ‘ఉప్పెన’ సినిమా విడుదల సమయంలో మా నాన్న చేసిన పని నాకు ఇంకా గుర్తుంది.
థియేటర్ గేట్ బయట నిలబడి ‘సినిమా బాగుందా’ అని వచ్చిన వారందరినీ అడిగారు. సినిమా చూడకుండా థియేటర్‌కు వచ్చిన వారి అభిప్రాయాలు మాత్రమే తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు నేను తీస్తున్న రామ్‌చరణ్ సినిమా బాగుందా అని ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది కచ్చితంగా హిట్ అవుతుంది అని బుచ్చిబాబు కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ‘ఉప్పెన’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు రెండో సినిమానే రామ్ చరణ్ (Ram Charan) ప్రాజెక్ట్.
‘పెద్ది’ (RC 16 Movie) అనే టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో ఓ విలేజ్ బేస్డ్ స్పోర్ట్ నేపథ్యంలో ఉంటుంది. తొలుత ఈ సినిమాను తారక్‌తో చేద్దామనుకున్నా ఆఖరికి అది రామ్‌చరణ్ దగ్గరకు వచ్చింది. ప్రస్తుతం రెండో షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. మార్చి 26న సినిమా ఫస్ట్‌లుక్ విత్ టైటిల్ రావొచ్చు అని అంటున్నారు. ఆ రోజు ప్రత్యేకత ఏంటో మీకు తెలిసిందే.