బన్నీ వాస్ (Bunny Vas) … ‘జి ఎ 2 పిక్చర్స్’ సంస్థ అధినేతగా బాగా ఫేమస్. అల్లు అర్జున్ కి (Allu Arjun) మేనేజర్ గా కెరీర్ ప్రారంభించిన ఇతను ఆ తర్వాత .. ‘గీతా ఆర్ట్స్’ సంస్థలో తెరకెక్కిన పలు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు. బన్నీ వాస్ కి సినిమాపై ఉన్న ప్యాషన్ చూసి ‘జి ఎ 2 పిక్చర్స్’ అనే సంస్థను స్థాపించి.. దాన్ని ఇతని చేతిలో పెట్టారు అల్లు అరవింద్ (Allu Aravind).
Bunny Vas
ఆయన నమ్మకాన్ని వాసు మొదటి నుండి నిలబెడుతూనే వచ్చాడు. కానీ తర్వాత ఏదో జరిగింది. బన్నీ వాస్ గీత దాటి సొంత బ్యానర్ స్టార్ట్ చేసుకునే పనులు మొదలుపెట్టారు. దీనిపై అతను క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. ‘నేను గీతా ఆర్ట్స్ నుండి బయటకు వెళ్లడం లేదు. నేను ఇందులోనే ఉంటూ.. నా పర్సనల్ ఇంట్రెస్ట్, అందులోనూ కొంచెం రిస్క్ అనిపించిన కథలు అరవింద్ గారిని ఇబ్బంది పెట్టకుండా సొంతంగా చేయాలని అనుకుంటున్నాను.
అందుకే వేరే పేరుతో ఓ బ్యానర్ స్టార్ట్ చేస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు వాసు. మొత్తానికి అతను చెప్పినట్టే… ‘బన్నీ వాస్ వర్క్స్’ అనే బ్యానర్ ను స్థాపించారు. మొదటి ప్రయత్నంగా ‘వైరా ఎంటర్టైన్మెంట్స్’ ‘సప్త అశ్వ మీడియా’ సంస్థలతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను జూన్ 6న రివీల్ చేయనున్నారు. ‘ఎవరో చెప్పుకోండి చూద్దాం’ అనే హ్యాష్ ట్యాగ్ ను బన్నీ వాస్ తన ట్విట్టర్లో జత చేయడంతో.. అదే టైటిల్ అవ్వొచ్చు అని కొందరు భావిస్తున్నారు.
Not a Pre-look,
But A Secret Peek
The Faces you might guess,
But the Madness they bring you definitely can’t.#EvaroCheppukondiChuddham