Allu Arjun: పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడుతుందా?

‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్‌ సినిమా ఏంటి? చాలా రోజుల నుండి టాలీవుడ్‌లో ఈ విషయమై చర్చ జరుగుతూనే ఉంది. కొరటాల శివతో అనుకున్న AA21 రద్దు అవడంతో అల్లు అర్జున నెక్స్ట్‌ ఏం చేస్తాడు అనేది తెలియక చాలా రకాలు పుకార్లు షికార్లు చేశాయి. అయితే వాటన్నింటికీ అల్లు అర్జున్‌ స్నేహితుడు, గీతా ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌ పనులు చూస్తున్న నిర్మాత బన్ని వాసు క్లారిటీ ఇచ్చేశాడు. అది చూస్తే అల్లు అర్జున్‌ లైనప్‌ సూపర్‌ స్ట్రాంగ్‌గా ఉందని చెప్పేయొచ్చు.

‘పుష్ప’ సినిమాను రెండు భాగాలుగా తీస్తారని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రెండో భాగానికి సంబంధించి పూర్తి స్థాయిలో కథ సిద్ధం కాలేదట. అందుకే తొలి పార్టు విడుదల చేసి.. అల్లు అర్జున్‌‘ఐకాన్‌’ సినిమా పనిలో పడతాడట. ఇది పూర్తి చేసి ఆ తర్వాత ‘పుష్ప 2’ తీస్తారట. ఇక్కడివరకు లైనప్‌ అంతా ఫిక్స్‌ అయిపోయిందట. దీని తర్వాత సినిమాల విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందట. అలా అని దర్శకులు సిద్ధంగా లేరని కాదు.

అల్లు అర్జున్‌ – మురుగదాస్‌ కాంబోలో సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి పుకార్లు వస్తున్నాయి. అది నిజమట. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయట. ఇది కాకుండా బోయపాటి శ్రీనుతో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌ మీదే ఓ సినిమా చేస్తాడట బన్నీ. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ముందు అనేది తర్వాత నిర్ణయిస్తారట. వీటి తర్వాత కొరటాల శివ సినిమా ఉంటుంది అంట. ఇదన్నమాట బన్నీ ఫ్యూచర్‌ ప్లానింగ్‌. వీళ్లు మాత్రమే కాకుండా ఇంకొంతమంది దర్శకులు, రచయితలు చెప్పిన కథలు బన్నీ విన్నాడు. అందులో ఏదైనా నచ్చితే లైనప్‌ పెరుగుతుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus