సీనియర్ స్టార్ దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) ఖాతాలో ‘రామాయణం’ (Ramayanam) ‘చూడాలని వుంది’ (Choodalani Vundi) ‘ఒక్కడు’ (Okkadu) వంటి బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ‘సొగసు చూడతరమా’ ‘మనోహరం’ ‘అర్జున్’ (Arjun) వంటి మంచి సినిమాలు కూడా ఉన్నాయి. అయితే తర్వాత అనుష్కతో (Anushka Shetty) ‘రుద్రమదేవి’ (Rudramadevi), సమంతతో (Samantha) ‘శాకుంతలం’ (Shaakuntalam) వంటి చారిత్రాత్మక సినిమాలు చేశారు. ఇందులో అల్లు అర్జున్ (Allu Arjun) సాయంతో ‘రుద్రమదేవి’ బాగానే గట్టెక్కింది. కానీ సమంతతో చేసిన ‘శాకుంతలం’ మాత్రం డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ సినిమా కంటెంట్ బాగానే ఉన్నా..
టెక్నికల్ గా చాలా పూర్ గా ఉండటంతో ఆడియన్స్ పెదవి విరిచారు. ఇక క్రిటిక్స్ అయితే ఏకిపారేశారు అని చెప్పాలి. ఇదిలా ఉండగా.. ‘శాకుంతలం’ తర్వాత గుణశేఖర్ తో సినిమాలు చేయడానికి స్టార్స్ ఎవ్వరూ ముందుకు రాలేదు. రానాతో చేయాల్సిన ‘హిరణ్యకశిప’ సైతం చేతులు మారినట్లు మొన్నామధ్య వార్తలు వచ్చాయి. దీంతో తన సొంత బ్యానర్ ‘గుణ హ్యాండ్ మేడ్ ఫిలిమ్స్’ పై ‘యుఫోరియా’ అనే సినిమా మొదలుపెట్టాడు గుణశేఖర్.
ఆయన కుమార్తె నీలిమ గుణ దీనికి నిర్మాత. భూమిక (Bhumika Chawla) వంటి సీనియర్లు ఇందులో నటిస్తున్నారు. ఇదొక యూత్ ఫుల్ మూవీ అని తెలుస్తుంది. షూటింగ్ ఎప్పుడో మొత్తం కంప్లీట్ అయిపోయిందట. కానీ శివరాత్రి రోజు వరకు ఈ విషయాన్ని రివీల్ చేయలేదు. ఆ రోజున ఒక మేకింగ్ వీడియోతో ఆ విషయాన్ని రివీల్ చేశారు.
ఇన్సైడ్ టాక్ ఏంటంటే.. ‘యుఫోరియా’ కి బిజినెస్ జరగడం లేదట. ఇప్పటికీ ఓటీటీ డీల్ కంప్లీట్ అవ్వలేదని, దాని కోసం టీం ఓటీటీ సంస్థల చుట్టూ తిరుగుతుంది అని సమాచారం. గుణశేఖర్ సినిమాలకి థియేట్రికల్ నుండి రెవెన్యూ రావడం కష్టం. అందుకే డిస్ట్రిబ్యూటర్లు కూడా జంకుతున్నారు అని వినికిడి.