Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » టైటిల్ మిస్టేక్ కాదు సెంటిమెంట్!! : నిర్మాత సి.కళ్యాణ్‌

టైటిల్ మిస్టేక్ కాదు సెంటిమెంట్!! : నిర్మాత సి.కళ్యాణ్‌

  • January 31, 2018 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

టైటిల్ మిస్టేక్ కాదు సెంటిమెంట్!! : నిర్మాత సి.కళ్యాణ్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి జంటగా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ నిర్మించిన చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. రీసెంట్‌గా విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి, పాటలకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ‘ఖైది నంబర్‌ 150’ చిత్రం తర్వాత సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని వున్నాయి. అలాగే సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బేనర్‌లో సి.కళ్యాణ్‌ నిర్మించిన ‘జై సింహా’ చిత్రం ఈ సంక్రాంతికి రిలీజై సూపర్‌హిట్‌ చిత్రంగా నిలిచింది. సో.. వీరిద్దరి సక్సెస్‌ఫుల్‌ కాంబినేషన్‌లో వస్తోన్న ‘ఇంటిలిజెంట్‌’ అందరి అంచనాలకు తగ్గట్లుగా రూపొందిందని ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9న రిలీజ్‌ కాబోతున్న సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్‌ ‘ఇంటిలిజెంట్‌’ చిత్ర విశేషాలను తెలిపారు.c-kalyan-about-inttelligent-movie10

టీజర్‌కి, సాంగ్స్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌..
‘జనవరి 12న పొంగల్‌కి సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో నిర్మించిన మా ‘జై సింహా’ చిత్రాన్ని సూపర్‌హిట్‌ చేసి మా బేనర్‌కి 2018లో గొప్ప శుభారంభాన్ని ఇచ్చారు ప్రేక్షకులు. అలాగే ‘ఇంటిలిజెంట్‌’ సినిమా ప్రారంభం రోజునే ఫిబ్రవరి 9న రిలీజ్‌ అని చెప్పటం జరిగింది. అనుకున్నట్లుగానే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. రీసెంట్‌గా మా నటసింహ బాలయ్యబాబు టీజర్‌ని రిలీజ్‌ చేశారు. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే మా యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ పాటల్ని లాంచ్‌ చేశారు. అన్ని పాటలకి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మా చిత్రం టీజర్‌ని, సాంగ్స్‌ని ఆదరిస్తున్న బాలయ్యబాబు అభిమానులకు, ప్రభాస్‌ అభిమానులకు, సాయిధరమ్‌ తేజ్‌ అభిమానులకు ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు.c-kalyan-about-inttelligent-movie9

ఫిబ్రవరి 4న రాజమండ్రిలో ‘ఇంటిలిజెంట్‌’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌..
‘ఇంటిలిజెంట్‌’ చిత్రం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ని ఫిబ్రవరి 4న రాజమండ్రి ఆర్ట్స్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌ వై జంక్షన్‌లో భారీ ఎత్తున జరుపుతున్నాం. ఈ ఫంక్షన్‌కి అందరి అభిమానులు విచ్చేసి సక్సెస్‌ చెయ్యాలని కోరుకుంటున్నాను. ‘ఛలో’ ప్రీ రిలీజ్‌ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవిగారు ‘ఇంటిలిజెంట్‌’ టైటిల్‌ చాలా బాగుంది అని వున్నంత సేపు మా సినిమా గురించే మాట్లాడారు. వినాయక్ చాలా ఇంటిలిజెంట్‌గా ఈ చిత్రాన్ని తీశాడు. అభిమానుల అంచనాలకు మించి వుంటుంది. అలాగే సాయిధరమ్‌ తేజ్‌ కెరీర్‌ గ్రాఫ్‌లో గొప్పగా చెప్పుకునే విధంగా ఈ చిత్రం నిలుస్తుంది.c-kalyan-about-inttelligent-movie8

తేజ్ డ్యాన్సులు చిరంజీవినిగారిని గుర్తుకుతెస్తాయి..
ఈ చిత్రంలో తేజ్‌ డ్యాన్స్‌లు ఇరగదీశాడు. అంతకు ముందు తేజ్‌ చిత్రాల్లో అన్నింటికంటే ఈ చిత్రంలో డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌ బాగా చేశాడు. చిరంజీవిగారు బిగినింగ్‌లో ఎలా చేశారో తేజు అలా చేశాడని అన్పించింది. చాలా కష్టపడి కసితో చేశాడు. ఫ్యాన్స్‌ అందరూ బాగా ఎంజాయ్‌ చేస్తారు. థమన్‌ చాలా మంచి పాటలు ఇచ్చాడు. మొత్తం నాలుగు పాటలున్నాయి. వినాయక్‌ చాలా బాగా చిత్రీకరించారు. ఈ చిత్రంలోని ‘కళామందిర్‌’ అనే పాటని భాస్కరభట్ల అద్భుతంగా రాశారు. ఈ పాటని జనవరి 31న కళామందిర్‌ షోరూమ్‌లో లాంచ్‌ చేస్తున్నాం. దీంతో అన్ని పాటలు రిలీజ్‌ అయ్యాయి. అలాగే మహోన్నతమైన వ్యక్తి ఇళయరాజాగారు, సీతారామశాస్త్రిగారి చేతుల మీదుగా ‘చమక్‌ చమక్‌’ వీడియో సాంగ్‌ని భారీగా లాంచ్‌ చేస్తున్నాం. అది ఎప్పుడు అనేది చెప్తాను.c-kalyan-about-inttelligent-movie7

‘ఇంటిలిజెంట్‌’ని ఎంత ప్రేమగా తీశాడో అర్థమయ్యింది..
వినాయక్‌ డైరెక్షన్‌లో ఫస్ట్‌టైమ్‌ సినిమా తీశాను. మేమిద్దరం డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌లా కాకుండా అన్నాదమ్ముల్లా కలిసి మెలిసి వుంటాం. మా ఇద్దరి గొప్ప జర్నీ ఈ సినిమా. నిర్మాతగా ఎప్పుడూ టెన్షన్‌ పడకుండా డైరెక్టర్‌కి కావాల్సింది ఇస్తూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్‌గా షూటింగ్‌ చేశాం. అలాగే మా హీరో, ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ ప్రతి ఒక్కరూ సహకరించారు. సినిమా చూశాను. ఎంత ప్రేమగా, అద్భుతంగా తీశాడో వినయ్‌ అని అర్థం అయ్యింది. ప్రతి ఫైట్‌, ప్రతి సాంగ్‌ని చాలా రిచ్‌గా తీశాం. ఈ సినిమా యాక్షన్‌ సీన్స్‌ కోసం సెట్స్‌ కూడా వేశాం. అన్నీ చాలా గ్రాండియర్‌గా వుంటాయి.c-kalyan-about-inttelligent-movie6

అన్నీ సినిమాలు హిట్ అవ్వాలి.. మా సినిమా ఇంకాస్త పెద్ద హిట్ అవ్వాలి..
నాకు సాయిధరమ్‌ తేజ్‌ కంటే వరుణ్‌తో చాలా అటాచ్‌మెంట్‌ ఎక్కువ. అందుకే ‘లోఫర్‌’ చిత్రాన్ని చాలా కలర్‌ఫుల్‌గా, భారీగా తీశాం. ‘ఇంటిలిజెంట్‌’ సినిమాకి వరుణ్‌ ‘తొలిప్రేమ’కి ఎలాంటి పోటీకాదు. అలాగే అన్నయ్య మోహన్‌బాబుగారు చాలా కష్టపడి ‘గాయత్రి’ సినిమా చేశారు. ఆ చిత్రం కూడా బాగా ఆడి మరిన్ని డబ్బులు రావాలని కోరుకుంటున్నా. వాళ్ళ ఫ్యామిలీ నుండే నేను ఇండస్ట్రీకి వచ్చాను.’గాయత్రి’ చాలా పవర్‌ఫుల్‌ టైటిల్‌. ఆ గాయత్రి దేవి ఆశీస్సులతో సినిమా మంచి సక్సెస్‌ అవ్వాలి. అన్ని సినిమాలు బాగా ఆడాలి. అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. థియేటర్స్‌కి ఆడియన్స్‌ మరింత మంది వస్తారు.c-kalyan-about-inttelligent-movie5

అసిస్టెంట్ టు ప్రొడ్యూసర్ వయా డైరెక్టర్..
అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా నా కెరీర్‌ స్టార్ట్‌ అయ్యింది. మా గురువుగారుర దాసరిగారి దయవల్ల నేను ఇంతవాణ్ణి అయ్యాను. నా డైరెక్షన్‌లో సుమన్‌, జయసుధ, సుహాసిని కాంబినేషన్‌లో ప్లాన్‌ చేశాం. అనుకోని సంఘటనల వల్ల ఆ సినిమా క్యాన్సిల్‌ అయ్యింది. దాంతో నిర్మాతగా మారాను. అప్పట్నుంచీ ఇప్పటిదాకా 69 సినిమాలు చేశాను. ‘ఇంటిలిజెంట్‌’ 70వ సినిమా.c-kalyan-about-inttelligent-movie4

నేషనల్ అవార్డ్ తెచ్చే సినిమా అది..
కథలో పూర్తిగా ఇన్‌వాల్వ్‌ అవుతాను. అయితే నా సలహాలు డైరెక్టర్‌కి చెప్తాను తప్ప పూర్తిగా ఒత్తిడి చేయను. మా గురువుగారు, రైటర్‌ సత్యమూర్తిగారి ప్రభావం నాపై ఎక్కువ వుంది. డైరెక్షన్‌లో ఇన్‌వాల్వ్‌ కాకుండా నిర్మాతగా నా వంతు బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తాను. అందర్నీ ఆలోచింపజేసే విధంగా ఓ కొత్త డైరెక్టర్‌తో ‘భారతి’ అనే సినిమా ప్లాన్‌ చేస్తున్నాను. ఆ సినిమా తప్పకుండా నేషనల్ అవార్డ్ స్థాయి సినిమా అవుతుంది.c-kalyan-about-inttelligent-movie3

“1945” ఒక ప్యూర్ లవ్ స్టోరీ..
రానా హీరోగా శివ డైరెక్షన్‌లో నిర్మించే ‘1945’ సినిమా ఆల్‌మోస్ట్‌ షూటింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. పది రోజుల వర్క్‌ మాత్రమే బేలెన్స్‌ వుంది. ఇది పీరియాడికల్‌ మూవీ. బ్యూటిఫుల్‌ లవ్‌స్టోరి. ఆ రోజుల్లో లవ్‌స్టోరి ఎంత క్లారిటీతో వుండేదో చూపిస్తున్నాం. రానా చాలా గొప్పగా చేశాడు. త్వరలో ఆ సినిమా రిలీజ్‌ చేస్తాం.c-kalyan-about-inttelligent-movie2

రామానాయుడుగారు స్ఫూర్తి..
నిర్మాతగా నాకు రామానాయుడుగారు స్ఫూర్తి. ఆయన ఇన్‌స్పిరేషన్‌తో ఇప్పటివరకు 70 సినిమాలు చేశాను. ఇదే ఎనర్జీతో ఓపికతో వంద సినిమాలు కంప్లీట్‌ చేస్తాను. నిర్మాతగా ఎంత బిజీగా వున్నా యస్‌యస్‌ఎస్‌ఐ ప్రెసిడెంట్‌గా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తున్నాను.c-kalyan-about-inttelligent-movie1

శరణమా-రణమా అనేది ఇవాళ తెలిసిపోతుంది..
మార్చి 1న థియేటర్స్‌ బంద్‌ పిలుపు కొరకు నార్త్‌, సౌత్‌వారితో గట్టిగా మీటింగ్స్‌ జరుగుతున్నాయి. నిర్మాతల్ని, డిస్ట్రిబ్యూటర్స్‌ని దోచుకుంటున్నారు. అలా చేస్తే చివరకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్‌ నక్సలైట్స్‌గా మారే అవకాశం వుంది. అలా జరగకూడదని మార్చి 1న బంద్‌ ప్రకటించి తగు చర్యలు తీసుకోబోతున్నాం. అందరికీ ఇండస్ట్రీలో మేలు జరిగేలా న్యాయం చేస్తాం.

– Dheeraj Babu

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #C.kalyan
  • #Inttelligent Movie
  • #Lavanya Tripathi
  • #Sai Dharam Tej

Also Read

BIGG BOSS 9: ‘ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావ్’.. మామూలు ‘అగ్నిపరీక్ష’ కాదే..!

BIGG BOSS 9: ‘ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావ్’.. మామూలు ‘అగ్నిపరీక్ష’ కాదే..!

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

Kingdom Collections: ‘కింగ్డమ్’ కి ఇక అన్ని విధాలుగా కష్టమే

related news

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

trending news

BIGG BOSS 9: ‘ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావ్’.. మామూలు ‘అగ్నిపరీక్ష’ కాదే..!

BIGG BOSS 9: ‘ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావ్’.. మామూలు ‘అగ్నిపరీక్ష’ కాదే..!

1 hour ago
Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి..పెద్దమ్మపై పెరుగుతున్న ఒత్తిడి

2 hours ago
Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

Athadu Collections: ‘అతడు’ 2వ రోజు కూడా బాగా హోల్డ్ చేసింది

5 hours ago
Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

Mahavatar Narsimha Collections: 3వ వీకెండ్ ఆల్ టైం రికార్డు సృష్టించింది

17 hours ago
Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

Sir Madam Collections: ‘సార్ మేడమ్’ కి మరో మంచి ఛాన్స్ మిస్ అయ్యింది

17 hours ago

latest news

Su from So & Kothapallilo:
సేమ్ కాన్సెప్ట్.. తెలుగు ఫ్లాప్, కన్నడలో హిట్

Su from So & Kothapallilo:
సేమ్ కాన్సెప్ట్.. తెలుగు ఫ్లాప్, కన్నడలో హిట్

1 hour ago
Nidhhi Agerwal: గవర్నమెంట్‌ వెహికల్‌లో నిధి అగర్వాల్‌.. క్లారిటీ ఇచ్చిన నటి!

Nidhhi Agerwal: గవర్నమెంట్‌ వెహికల్‌లో నిధి అగర్వాల్‌.. క్లారిటీ ఇచ్చిన నటి!

2 hours ago
Nagarjuna: ఆ పాత్ర గురించి మనవళ్లకు చెప్పను అంటున్న నాగార్జున.. అంతలా ఏముందబ్బా?

Nagarjuna: ఆ పాత్ర గురించి మనవళ్లకు చెప్పను అంటున్న నాగార్జున.. అంతలా ఏముందబ్బా?

2 hours ago
Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

19 hours ago
Rising Producers Press Meet: 50% పెంచుతాం.. బాధ్యత వహిస్తారా?

Rising Producers Press Meet: 50% పెంచుతాం.. బాధ్యత వహిస్తారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version