పెద్ద ఫ్యామిలీ నుండీ ఓ హీరో ఎంట్రీ ఇస్తున్నాడంటే.. అతని పై ఫోకస్ ఎక్కువగానే ఉంటుంది. డ్యాన్స్ లు బాగా చేయగలడా.. ఫైట్ లు బాగా చేయగలడా అనేదే మొదటిగా చూస్తారు. ఆ తరువాత నటనలో ఎంత వరకూ రాణించగలడు అనేది అంచనా వేస్తుంటారు. ఇప్పటివరకూ ఇలాంటి వాటినే ఎక్కువగా చూస్తూ వచ్చారు కానీ ఇప్పుడు మరొకటి కూడా యాడ్ అయ్యింది. అదే బాక్సాఫీస్ స్టామినా..! ఈ విషయంలో ఇప్పటికే మన అక్కినేని అఖిల్, రాంచరణ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటివారు ఓ బెంచ్ మార్క్ ను క్రియేట్ చేసి పెట్టారు. అఖిల్ మొదటి చిత్రం..
ఫస్ట్ డే ఓపెనింగ్స్ ను కనుక గమిస్తే రూ.7.6కోట్ల వరకూ షేర్ వసూల్ చేసింది. వి.వి.వినాయక్ వంటి పెద్ద దర్శకుడు పైగా నాగార్జున వంటి స్టార్ హీరో కొడుకు కావడంతో అంతటి భారీ ఓపెనింగ్స్ సాధ్యమయ్యాయి. ఇక రాంచరణ్ కూడా తన మొదటి చిత్రంతో 2007 టైంలోనే ఏకంగా రూ.3.75కోట్ల షేర్ ను మొదటిరోజు రాబట్టాడు. డెబ్యూ హీరోల్లో వీరిదే రికార్డ్. అయితే ‘ఉప్పెన’ చిత్రంతో వైష్ణవ్ తేజ్.. వీరి రికార్డులను బద్దలుకొట్టగలడా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇప్పుడు 100శాతం ఆకుపెన్సీతో థియేటర్లు రన్ కాబోతున్నాయి. పైగా ఈ ‘ఉప్పెన’ చిత్రం పాటలు మరియు ట్రైలర్ లతో బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. పైగా పోటీగా మరో సినిమా కూడా లేదు. కాబట్టి మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఫిబ్రవరి వంటి డ్రై సీజన్లో విడుదలవుతుంది కాబట్టి.. అదొక్కటే మైనస్ పాయింట్.