మంగ్లీ.. ప్రస్తుతం ఉన్న స్టార్ సింగర్స్ లో ఒకరు. తెలంగాణాకు చెందిన ఈమె జానపద గీతాలు, పండుగల సీజన్ కు భక్తి పాటలు పాడుతూ బాగా ఫేమస్ అయ్యింది. ఆమె పాడిన పాటలకు మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం, ఎక్కడ చూసినా అవే పాటలు వినిపించడంతో ఈమెకు సినిమాల్లో కూడా పాటలు పాడే అవకాశాలు లభించాయి. ‘వాడు నడిపే బండి’ ‘సారంగ దరియా’ ‘జింతాక్ జింతాక్’ పాటలతో మంగ్లీ స్టార్ సింగర్ గా ఎదిగింది. ఈమె వాయిస్ అందరినీ హుషారెత్తించే విధంగా ఉంటుంది.
మాస్ పాటలకు ఒకప్పుడు గీతా మాధురి గుర్తుకొచ్చేది.. ఇప్పుడైతే ఆమెను వెనక్కి నెట్టి మంగ్లీ ఫస్ట్ ప్లేస్ కి వచ్చేసింది. మొన్నామధ్య మంగ్లీ సినిమాల్లో కూడా నటించింది. నితిన్ నటించిన ‘మాస్ట్రో’ లో ఈమె కిడ్నీలు అమ్మేసే చీటర్ లకు సాయం చేసే వ్యక్తిగా కనిపించింది. ఇంకా కొన్ని సినిమాల్లో నటించడానికి కూడా మంగ్లీ రెడీ అయ్యింది. ఇదిలా ఉండగా.. మంగ్లీ పాడిన పాటలు … వివాదాలకు దారి తీసిన సందర్భాలు ఉన్నాయి.
గతంలో మంగ్లీ పాడిన ఓ భక్తి పాట కాంట్రావర్సీ అయితే ఆమె పై మండిపడుతూ నెటిజన్లు, హిందూ మతానికి చెందిన పెద్దలు ఫైర్ అయ్యారు.తర్వాత ఆ వివాదంపై మంగ్లీ వివరణ ఇవ్వడం… క్షమాపణలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మరోసారి మంగ్లీ చిక్కుల్లో పడింది. ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా ఆమె శ్రీకాళహస్తిలో ఓ పాటను షూట్ చేయడం జరిగింది. ఆ పాట బాగా వైరల్ అయ్యింది.. అదే సమయంలో వివాదాలకు కూడా దారి తీసిందని చెప్పాలి.
సుద్దాల అశోక్ తేజ్ రచించిన ఈ పాట శ్రీకాళహస్తిలోని కాలభైరవ స్వామి ఆలయంలో షూట్ చేశారు. నిజానికి అక్కడ షూటింగ్ కి అనుమతి లేదు. కానీ మంగ్లీ పాట అక్కడ చిత్రీకరించడం జరిగింది. స్వామి వారి ఆలయంలో ఆ పాటను ఎలా షూట్ చేస్తారు.. అనుమతి లేదు కదా? అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రెండు దశాబ్దాలుగా షూటింగ్లకి అనుమతి లేని ఆలయంలో మంగ్లీ మాత్రం ఇలా పాట షూట్ చేయడం, ఆలయంలోని కాలభైరవ స్వామి విగ్రహం వద్ద మంగ్లీ నృత్యం చేసిన విజువల్స్ ఉండడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మరి ఈ వివాదం పై మంగ్లీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?