‘మద్యం సేవించుట హానికరం..’ సినిమాలో పాత్రధారులు మద్యం తాగుతున్నప్పుడు తెరపై కనిపించే హెచ్చరిక ఇది. ఇలా ఎంత అవగాహన కల్పించినా ఆల్కహాల్ ని చాలా మంది వదులుకోలేక పోతున్నారు. అందులో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఉన్నారు. వీకెండ్స్ లో తాగి ఎంజాయ్ చేస్తుంటారు. తాగడం వరకు ఏమి ఇబ్బందిలేదు.. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంలోనే అసలు చిక్కుంది. పరిమితికి మించి పెగ్గులేస్తే కేసుల్లో ఇరుక్కోవాల్సిందే. అలా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బంది పడిన సినీ సెలబ్రిటీస్ పై ఫోకస్..
నవదీప్యువ హీరో నవదీప్ తాగి కార్ ని నడపడమే కాకుండా.. ఆపమన్న పోలీసుల మాట వినకుండా అర్ధరాత్రి నడిరోడ్డుపై ఛేజింగ్ సీన్ చేసి వార్తల్లో నిలిచారు. చివరికి అతన్ని పట్టుకున్న ట్రాఫిక్ అధికారులతో మిస్ బిహేవ్ చేసి చెడ్డ పేరు తెచ్చుకున్నారు.
నిఖిల్వరుస విజయాలతో దూసుకుపోతున్న నిఖిల్ 2011 డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇరుక్కున్నారు. అతను నడుపుతున్న కారు పరిస్థితిని గమనించి ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ పట్టుకున్నారు. నిఖిల్ ఫుల్ గా తాగి ఉన్నారని గుర్తించి కారు తో పాటు అతన్ని రాత్రంతా స్టేషన్లో ఉంచి ఉదయాన ఇంటికి పంపించారు.
శివబాలాజీయువ నటుడు శివబాలాజీ ఎక్కువగా డ్రింక్ చేసి వాహనం నడిపారు. 2012 లో హైదరాబాద్ లోని భారతీయ విద్యా భవన్ వద్ద పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. డ్రన్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసే సమయంలో మీడియా గుమిగూడడంతో శివ బాలాజీ సహనాన్ని కోల్పోయి ప్రవర్తించారు.
సాయి రోహిత్ వర్ధమాన సినీ హీరో సాయి రోహిత్ (కాయ్ రాజ్ కాయ్ ఫేమ్) జూబ్లీహిల్స్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు. ఫుల్ గా తాగి కారు నడుపుతున్నందున ఇతనిపై కేసు నమోదు చేశారు.
భరత్మాస్ మహారాజ్ రవితేజ తమ్ముడిగా, నటుడిగా అందరికి పరిచయమైన భరత్ అనేక సార్లు స్టేషన్ మెట్లు ఎక్కారు. తాగి వాహనం నడపడమే కాకుండా మద్యం మత్తులో నడి రోడ్డుపై న్యూసెన్స్ చేయడంతో భరత్ కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది.
కోన వెంకట్తెలుగు చిత్ర పరిశ్రమలో కమర్షియల్ చిత్రాల రచయితగా పేరు తెచ్చుకున్న కోన వెంకట్ మద్యం మత్తులో ఇరుక్కున్నారు. ఓ సారి పరిమితికి మించి తాగి కార్ నడుపుతుండగా పోలీసులకు చిక్కారు. పోలీసులు ఇచ్చే కౌన్సలింగ్ లో కూడా పాల్గొన్నారు. అప్పటి నుంచి జాగ్రత్తగా ఉన్నారు.
బీవీఎస్ రవిపోలీసుల సాధారణ చెకప్ లో రచయిత, డైరెక్టర్ బీవీఎస్ రవి మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు దొరికిపోయారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ లో ఫెయిల్ కావడంతో ఇతనిపై కేస్ బుక్ చేశారు.
రాజా రవీంద్రనెగిటివ్ రోల్స్ పోషించే రాజా రవీంద్ర అత్యధికంగా ఆల్కహాల్ తీసుకొని కార్ నడుపుతుండగా ట్రాఫిక్ పోలీసులకు చిక్కారు. కోర్టు వరకు వెళ్లి ఫైన్ కట్టి బయట పడ్డారు.
సూర్యాంత్పోలీసుల లెక్కల ప్రకారం రక్తంలో 30 మిల్లీగ్రాములు మాత్రమే ఆల్కహాల్ ఉండాలి. కానీ ఈ పరిమితి దాటి 70 మిల్లి గ్రాముల ఉన్నప్పటికీ బీఎండబ్యు కారు నడిపి నటుడు సూర్యాంత్ దొరికారు. మత్తు పూర్తిగా దిగే వరకు పోలీసుల అదుపులో ఉండి బయటపడ్డారు.