చందు మొండేటి తర్వాతి సినిమాలు ఇవే..!
- November 17, 2016 / 11:29 AM ISTByFilmy Focus
‘కార్తికేయ’ వంటి భిన్నమైన కథని తొలి సినిమాకి ఎంచుకుని, తొలి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ రుచి చూశాడు చందు మొండేటి. అతగాడి ప్రతిభ పసిగట్టిన అక్కినేని వారు వెంటనే అతడిని లాక్ చేసేశారు. తాను అభిమానించే హీరో కావడంతో చందు కూడా వారు అడిగినట్టుగా సొంత స్క్రిప్ట్ ని పక్కన పెట్టి రీమేక్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఈసారి ఫలితం మారలేదు. దీంతో అతడిపై విశ్వాసం మరింత పెంపొందింది. ఈ ధైర్యంతో రవితేజ, ఎన్టీఆర్ సహా పలువురు హీరోలకు కథలు వినిపించిన చందు తన తర్వాతి సినిమాలకి సంబంధించి ప్రణాళిక సిద్ధం చేశాడు.
చందు అభిమానించే అక్కినేని నాగార్జునతో ఓ పోలీస్ డ్రామా చేయనున్నాడట. ఇప్పటికే ఇరువురి మధ్యా చర్చలు పూర్తయినట్టు సమాచారం. పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘శివమణి’ తర్వాత నాగ్ పోలీస్ పాత్రలో కనపడనుండటం గమనార్హం. అయితే ప్రస్తుతం చేస్తున్న ‘నమో వేంకటేశాయ’, ఓంకార్ దర్శకత్వం వహించనున్న ‘రాజుగారి గది2’ సినిమాలు పూర్తయ్యాకే చందు సినిమా మొదలెట్టనున్నారట నాగ్. మరోవైపు నిఖిల్ కోసం ‘కార్తికేయ-2’ స్క్రిప్ట్ కూడా పూర్తి చేసేసాడట ఈ ‘ప్రేమమ్’ దర్శకుడు. నాగ్ సినిమా గనక ఆలస్యమైతే నిఖిల్ ఇప్పుడు సుధీర్ వర్మతో చేస్తున్న సినిమా పూర్తి కాగానే ‘కార్తికేయ-2’ పట్టాలెక్కించాలన్నది చందు వ్యూహం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















