‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ లభించడంతో దేశమంతా పండుగ చేసుకుంటుంది. నార్త్ సోదరులు కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా.. వారి ఏడుపుని కూడా మన వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న సందర్భాలను చూస్తూనే ఉన్నాం.’ఆర్.ఆర్.ఆర్’ టీం ఆనందానికి ఆకాశమే హద్దు అన్నట్టు ఉంది. అయితే ఒక్క చంద్రబోస్ మాత్రం ఆస్కార్ వచ్చినా ఆనందం లేదు అన్నట్టు కామెంట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ఆ క్షణాలు అనిర్వచనీయమైన అనుభూతినిచ్చాయి.
ఆస్కార్ సాకారమైన క్షణాలు నన్ను భావోద్వేగానికి గురిచేశాయి. భారత దేశ కీర్తిని, తెలుగు సాహిత్య గౌరవాన్ని నా చేతిలో నిలుపుకున్నట్లుగా అనిపించింది. నిజానికి ఒక్కసారైనా నేషనల్ అవార్డు అందుకోవాలనేది నా లక్ష్యంగా భావించాను. అది నెరవేరకముందే నాలుగు ఇంటర్నేషనల్ పురస్కారాలు నాకు లభించడం నిజంగా వంద రెట్లు ఆనందాన్ని ఇచ్చాయి. అయితే ఇది సాహిత్యంతో పాటు సహనానికి కూడా లభించిన అవార్డుగా నేను భావిస్తాను. నా 27 ఏళ్ళ సినీ కెరీర్లో 19 నెలలు రాసిన పాట ఇదొక్కటే.
మన పూర్వికులు, నా సమకాలీకులు ఎన్నో గొప్ప పాటలు రాశారు అని నాకు అనిపిస్తుంది. మనది గొప్ప సాహిత్యపరమైన, సంగీత పరమైన భాష అని ఆస్కార్ వేదికపై చెప్పాను. ఇప్పుడు నాపై చాలా బాధ్యతాయుతమైన బరువు పడినట్టు అనిపిస్తుంది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా నడుచుకుంటూ గొప్ప సాహిత్యం అందించాలనేది నా కర్తవ్యంగా మారింది’ అంటూ చంద్రబోస్ చెప్పుకొచ్చారు. చంద్రబోస్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.