Akhil: సగం షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వకుండానే..!

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో కెరీర్లో మొదటి కమర్షియల్ హిట్ ను అందుకున్నాడు అఖిల్. నిజానికి మొదటి రోజు ఆ సినిమాకి వచ్చిన టాక్ ను బట్టి చూస్తే.. అది బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు లేవని అంతా అనుకున్నారు. కానీ దసరా పండుగ సెలవులు బాగా కలిసొచ్చి.. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసింది. ఇదిలా ఉండగా.. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ఎన్నో సార్లు స్క్రిప్ట్ విషయంలో మార్పులు చేయడం, రీ షూట్లు జరపడం వంటివి జరిగాయి.

దిల్ రాజు నిర్మించిన ‘షాదీ ముబారఖ్’ కథ… ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ కథ ఒకేలా ఉందని భావించి బ్యాచిలర్ కు చాలా మార్పులు చేశారు. ఫైనల్ రష్ ఓకె అనిపించుకున్నాకే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. అయితే అఖిల్ తర్వాతి సినిమా ‘ఏజెంట్’ విషయంలో మాత్రం అప్పుడే రిపేర్లు స్టార్ట్ అయ్యాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ చిత్రం షూటింగ్ 25శాతం పూర్తయ్యింది. అనూహ్యంగా టీంలో కొంతమంది కోవిడ్ భారిన పడడంతో షూటింగ్ ఆగిపోయింది.

ఇప్పటి వరకు షూట్ చేసిన రష్ ను చూసిన సురేందర్ రెడ్డి అండ్ టీం.. హీరో క్యారెక్టరైజేషన్లో కొన్ని మార్పులు చేశారట. త్వరలోనే వాటిని మళ్ళీ షూట్ చేయబోతున్నారనేది తాజా సమాచారం. నాగార్జున, చిరంజీవి వంటి పెద్ద హీరోల ఫ్యామిలీకి చెందిన సినిమాలకి ఇలా రీషూట్లు జరగడం రొటీన్ మేటరే..! కానీ ‘ఏజెంట్’ సినిమా స్టార్టింగ్ లోనే ఇలా రీషూట్లకి రెడీ అవ్వడం కొత్త విషయం అని చెప్పాలి. ఇటీవల వచ్చిన ‘బంగార్రాజు’ సినిమాకి కూడా స్క్రిప్ట్ లో చాలా మార్పులు జరిగాయి. అయితే షూటింగ్ విషయంలో పెద్ద ల్యాగ్ లేకుండా లాగించేసారు.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus