Pushpa Release Date: మళ్ళీ కన్ఫ్యూజన్లో ‘పుష్ప’ టీం..!

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌- సుకుమార్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పార్ట్ 1… ‘పుష్ప ది రైజ్’ పేరుతో డిసెంబ‌ర్ 17న విడుదల కాబోతున్నట్టు కూడా ప్రకటించారు. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటుల పాత్రలకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లను అలాగే పాటలను విడుదల చేస్తూ ఏదో ఒక రకంగా ‘పుష్ప’ వార్తల్లో ఉండేలా చేస్తున్నారు.ప్రమోషన్ల విషయంలో అన్ని సినిమాల కంటే కూడా ఓ మెట్టు పైనే ఉంది ‘పుష్ప’.

కానీ ఈ పాన్ ఇండియా చిత్రం నిర్మాతలు ప్రకటించిన తేదీకి విడుదలవుతుందా అనేది పెద్ద ప్రశ్న?ఎందుకంటే.. పాన్ ఇండియా లెవెల్లో ‘పుష్ప’ రావడం అంత ఈజీ కాదు. టీం అంతా నిద్ర లేకుండా కిందా మీదా కష్టపడుతున్నా సుకుమార్ చెక్కుడికి… ఒక రోజులో అనుకున్న పని 4 రోజులు పడుతుందట. అల్లు అర్జున్ తన వరకు డబ్బింగ్ పూర్తిచేసాడు. ఒక పాట చిత్రీకరణ కొంతవరకు బ్యాలన్స్ ఉంది. మరో పక్క విపరీతంగా కురుస్తున్న వర్షాల వల్ల చాలా వర్క్ డిలే అవుతుందని కూడా వినికిడి.

ఆ రకంగా చూసుకుంటే డిసెంబర్ 17కి పుష్ప రావడం సాధ్యం కాదు.ఒకవేళ రేసు నుండీ తప్పుకుందాం అని మేకర్స్ అనుకున్నా ఇంకో డేట్ అడ్జస్ట్ చేయడం వారికి మరో పెద్ద టాస్క్. ఎందుకంటే.. పోటీగా మరికొన్ని పెద్ద సినిమాలు అలాగే మీడియం రేంజ్ సినిమాలు విడుదల తేదీల కోసం వెతుకుతున్నాయి. ‘పుష్ప’ కనుక తప్పుకుంటే మరో 6 నెలల వరకు సరైన రిలీజ్ డేట్ అది కూడా సోలో రిలీజ్ డేట్ దొరకడం కష్టమే..!

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Share.