RRR రిలీజ్.. ఇలా అయితే మళ్ళీ క్యాన్సిల్ అయినట్లే

టాలీవుడ్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మల్టీస్టారర్ RRRపై అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఈ సినిమా కోసం నందమూరి, మెగా అభిమానులు గత ఏడాది నుంచి ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈ రోజు రిలీజ్ డేట్ పై ఒక క్లారిటీ ఇచ్చారు గాని అది కూడా నమ్మడానికి వీలు లేదని అనిపిస్తోంది. రాజమౌళి సినిమా రిలీజ్ చేసే వరకు కూడా నమ్మడానికి వీలు లేదని ఇప్పటికే చాలా రకాల మీమ్స్ వచ్చాయి.

ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం అక్టోబర్ 13న సినిమాను విడుదల చేయడానికి అసలైన వాళ్లే ఒప్పుకోవడం లేదట. సినిమా రిలీజ్ బిజినెస్ కు ఎంతో ముఖ్యమైన డిస్ట్రిబ్యూటర్స్ కాస్త అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వెంటనే నిర్మాత డివివి.దానయ్యతో మాట్లాడి డేట్ ను మర్పించే ఛాన్స్ ఉన్నట్లు అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే దసరా హాలిడేస్ లో కలెక్షన్స్ బాగానే వస్తాయి కానీ సంక్రాంతికి అంతకంటే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని

ప్రాఫిట్ జోన్ లోకి తొందరగా రావాలి అంటే 2022జనవరిలో సినిమాను రిలీజ్ చేయించాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఎలాగూ రెండేళ్లు లేటయ్యింది. మరో రెండు నెలలు ఆలస్యం అయితే పెద్దగా నష్టమేమీ ఉండదని దాదాపు 450కోట్ల పెట్టుబడి పెట్టిన సినిమాకి సంక్రాంతి సీజన్ సరైనదనే చెబుతారట. మరి నిర్మాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus