Charith Manas: భారీగా వర్కౌట్ చేస్తూ కష్టపడుతున్న చరిత్ మానస్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఈయన హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక మహేష్ బాబు బావ సుదీర్ బాబు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన కూడా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం పెద్ద ఎత్తున కష్టపడుతున్న కూడా విజయం తనని వరించలేదు. ఈయన కెరియర్లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవని చెప్పాలి. ఇక సుధీర్ బాబుకి ఇద్దరు కుమారులనే విషయం మనకు తెలిసిందే.

వీరి పెద్ద కుమారుడు చరిత్ మానస్ ఇదివరకే పలు సినిమాలలో బాల నటుడిగా నటించే ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా సుధీర్ బాబు నటిస్తున్నటువంటి సినిమాలలో చరిత్ బాల నటుడిగా నటించారు. ఇక తనకు సినిమాలు అంటే చాలా ఇష్టమని తను ఇండస్ట్రీలోకి హీరోగా వస్తారు అంటూ పలు సందర్భాలలో సుధీర్ బాబు తెలియజేశారు. ఇక ఈయన హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం ఇప్పటినుంచి భారీగా కసరత్తుల మొదలు పెట్టారని తెలుస్తుంది.

తాజాగా ఈయన వర్కౌట్స్ చేస్తున్నటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ వీడియో పై వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అప్ కమింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు టాలీవుడ్ యాక్షన్ హీరో అవుతారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ మహేష్ బాబు పోలికలతో లేకపోయినా మహేష్ మేనల్లుడు చరిత్ మానస్ (Charith Manas) మాత్రం అచ్చం మహేష్ బాబు పోలికలతో ఉండటం విశేషం.

ఇలా ఈయన తన మేనమామ పోలికలతో ఉండడంతో ఈయనని జూనియర్ మహేష్ బాబు అంటూ అభిమానులు పిలుస్తూ ఉంటారు. మరి ఈయన ఇండస్ట్రీలోకి వచ్చి తన మామలా మంచి సక్సెస్ అందుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus