కొంతమంది సెలబ్రిటీలు మందు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా చేసిన సంగతి తెలిసిందే. ఆ టైములో వాళ్ళందరి పై దుమ్మెత్తి పోశారు జనాలు.’డబ్బులు కోసం యువతని పక్కదోవ పట్టించే విధంగా దిగజారిపోవాలా’ అంటూ గతంలో ఎంతో మంది సెలబ్రిటీల పై విమర్శలు గుప్పించారు. దాంతో అలాంటి బ్రాండ్ల జోలికి సెలబ్రిటీలు పోవడం లేదు. అయితే ఈ మధ్యన హీరోయిన్లు మద్యపానాన్ని ఎంకరేజ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. మొన్నామధ్య హీరోయిన్ రెజీనా ‘టీచర్స్’ బ్రాండ్ ని తన ఇన్స్టాలో ప్రమోట్ చేస్తూ ట్రోలింగ్ కు గురయ్యింది.
అయినప్పటికీ మిగిలిన హీరోయిన్లు జాగ్రత్త పడటం లేదు. వాళ్ళకి డబ్బులే ముఖ్యం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అందులో కాజల్ అగర్వాల్ కూడా ఒకరని తాజాగా రుజువైంది. మేటర్ ఏంటంటే కాజల్- గౌతమ్ కిచ్లుల వెడ్డింగ్ యానివర్సరీని పురస్కరించుకుని కాజల్…తన భర్తతో కలిసి ‘టీచర్స్’ బ్రాండ్ ని ఇన్ స్టా వేదికగా ప్రమోట్ చేసింది.’అందరూ దీపావళిని ఈ బాటిల్ తో సెలెబ్రేట్ చేసుకోండి’ అన్నట్టు ఆమె కామెంట్ పెట్టింది.అంతేకాదు తన భర్తని ఈ బాటిల్ తో ఎంజాయ్ చేయమని… అలాగే అందరూ బాధ్యతగా తాగాలని..
ఇది 25 ఏళ్ళ వయసు పైబడిన వారికి మాత్రమే’ అంటూ పేర్కొంది కాజల్. వాళ్లకి డబ్బులు వస్తాయి కాబట్టి చెబుతున్నారు. ఎక్కువ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలతో ఇలాంటి పోస్ట్ లు పెట్టిస్తే తమ బ్రాండ్ ప్రమోట్ అవుతుంది కాబట్టి… వాటి యాజమాన్యాలు వీళ్ళకి డబ్బులిస్తాయి. కానీ జనాలు వీటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోకూడదు అన్నది విశ్లేషకుల మాట.
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!