పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది.. అన్నట్టుగా కొంతమందిలో చిన్నప్పుడే వారిలోని నటన బయట పడుతుంది. బుడు బుడి అడుగుల వేసే వయసులోనే భలే నటించేస్తుంటారు. ముద్దు ముద్దు మాటలు ఆడే సమయంలో సూపర్ డైలాగ్స్ చెప్పి మనసుదోచుకుంటారు. అందరి పిల్లల్లా బడి, కాలేజీ పూర్తి చేసినా వారి ఒంట్లోని నటన మాత్రం ఎక్కడికి పోదు. తిరిగి హీరోగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి శభాష్ అనిపించుకుంటారు. అలా తెలుగు ఇండస్ట్రీలో బాల నటులుగా మెప్పించి, హీరోలుగా నిరూపించుకున్న వారిపై ఫోకస్…
అఖిల్కింగ్ అక్కినేని నాగార్జున, అమలల ముద్దుల కుమారుడు అఖిల్ పాకే వయసులోనే కెమెరాను ఫేస్ చేశారు. ముద్దొచ్చే ఎక్స్ ప్రెషన్స్ తో అల్లరి చేష్టలతో అభిమానులను ఏర్పరుచుకున్నారు. ఇరవై ఏళ్ళక్రితం వచ్చిన ఈ మూవీ మంచి ఓపెనింగ్స్ ని రాబట్టుకుంది. ఆ బుడతడు ఇప్పుడు అఖిల్ అనే మూవీ ద్వారా హీరోగా అరంగ్రేటం చేసి అదరగొట్టారు.
తరుణ్ కుమార్నువ్వేకావాలి, నువ్వులేక నేను లేను వంటి హిట్ సినిమాల్లో హీరోగా నటించిన తరుణ్ బాలనటుడిగా అవార్డులను సొంతం చేసుకున్నాడు. చిన్నప్పుడు అతను నటించిన అంజలి, ఆదిత్య 369 చిత్రాలు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. హీరోగా కూడా వరుస హిట్లు కొట్టాడు.
నాగ అన్వేష్“ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు” సినిమాలో విక్టరీ వెంకటేష్ ని వణికించిన బాల నటుడే నాగ అన్వేష్. అతని ముద్దు ముద్దు మాటలకు కుటుంబ సమేతంగా ఫ్యాన్స్ అయిపోయారు. నాగ అన్వేష్ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన అనంతరం “వినవయ్యా రామయ్య” అనే మూవీ ద్వారా హీరోగా పరిచయమయ్యారు. ఇందులో తన నటనతో యువతకు దగ్గరయ్యారు.
ఆకాష్ పూరిప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ చిరు ప్రాయంలో అనేక సినిమాల్లో కనిపించాడు. చిరుత, బుజ్జిగాడు చిత్రాలు అతనికి గుర్తింపును తీసుకొచ్చాయి. లోటస్ పాండ్ అనే బాల చిత్రంలోనూ ఆకాష్ తన నటనను నిరూపించుకున్నాడు. గత ఏడాది ఆంధ్ర పోరి అనే మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం తండ్రి దగ్గర అసిస్టెంట్ డైరక్టర్ గా చేస్తున్నాడు.
మహేంద్రన్బాల నటుడిగా మహేంద్రన్ అనేక సినిమాల్లో నటించాడు. ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించే ఈ అబ్బాయి ఆహా చిత్రంలో చేసిన అల్లరి మరిచి పోలేము. అలాగే సింహాద్రి సినిమాలో బాల ఎన్టీఆర్ పాత్ర పోషించి పేరు తెచ్చుకున్నాడు. ఇతను “విజా(2013 ) “అనే తమిళ మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ లోను మంచి కథతో రావడానికి ట్రై చేస్తున్నాడు.
బాలాదిత్యలిటిల్ సోల్జెర్ చిత్రంలో బాలాదిత్య చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు. ఆ తర్వాత 20 కి పైగా సినిమాల్లో బాల నటుడిగా చక్కని నటన ప్రదర్శించాడు. రెండు నంది అవార్డులు సొంతం చేసుకున్నాడు. 2003 లో చంటిగాడు మూవీ ద్వారా హీరోగా మారారు. “1940 లో ఒక గ్రామం” అనే మూవీలో అద్భుతంగా నటించినా అవకాశాలు రాకపోవడంతో టీవీ షోలు చేసుకుంటున్నారు.
తనీష్భక్తి కథా చిత్రం దేవుళ్లు లో అయ్యప్ప స్వామిగా తెలుగు ప్రేక్షకులను తనీష్ ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మన్మధుడు సినిమాలోనూ బాగా నవ్వించాడు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ నచ్చావులే మూవీ తో హీరో అయ్యాడు. దీని తరువాత కొన్ని సినిమాల్లో హీరోగా చేసినా.. అవి ఆశించినంతగా ఆడక పోవడంతో.. ఇప్పుడు కృష్ణవంశీ నక్షత్రంలో విలన్ గా కనిపించబోతున్నాడు.
మనోజ్ నందన్ఛత్రపతి మూవీలో “ఒట్టేసి ఒక మాట.. ఒట్టేయకుండా ఒక మాట చెప్పనమ్మా” అనే డైలాగ్ మనసుని టచ్ చేస్తుంది. ఆ డైలాగ్ ని సినిమాలో మొదటిగా చెప్పే అబ్బాయే మనోజ్ నందన్. జూనియర్ ప్రభాస్ గా నటించిన ఇతను 2012 నాటికీ హీరో గా అవతారమెత్తాడు. ‘ఒక రొమాంటిక్ క్రైమ్ కథ’ , ‘ప్రేమ ప్రయాణం’, ఒక క్రిమినల్ ప్రేమ కథ (2014).. ఇలా అనేక సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించాడు.
తేజ సజ్జబుల్లి మెగా స్టార్ గా ఇంద్రలో కనిపించిన చిన్నారి పేరు తేజ సజ్జ. మరికొన్ని సినిమాల్లోనూ బాలనటుడిగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు హీరో గా రావడానికి సిద్ధమవుతున్నాడు.
శ్రీ హర్ష మండకింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “గోవింద గోవింద” సినిమాలో నామాలు పెట్టుకుని మౌనంగా ఉండే అబ్బాయిని ఎవరూ మరిచిపోలేరు. ఆ పాత్ర పోషించిన పిల్లోడి పేరు శ్రీ హర్ష. అతను ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. శ్రీ హర్ష నటించిన “సెల్ఫీ ప్రేమ కథ” షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్ లో ఎక్కువ వ్యూస్ సాధిస్తోంది.