Sahasra Sree: చిన్నాలోని పాప బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

రీసెంట్ గా విడుదలైన సినిమాలలో ప్రేక్షకుల గుండెల్ని పిండేసిన చిత్రం సిద్దార్థ్ హీరో గా నటించిన ‘చిన్నా’. ఇతర భాషల్లో గ్రాండ్ హిట్ గా నిల్చిన ఈ సినిమా , తెలుగు లో కూడా రీసెంట్ గానే విడుదలై మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. గడిచిన దశాబ్ద కాలం లో సిద్దార్థ్ నుండి ఇంత గొప్ప సినిమా రాలేదు. నటన పరంగా కూడా ఈ సినిమానే ఆయన కెరీర్ బెస్ట్ అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఈ చిత్రం లో ఆయన కేవలం నటించడం మాత్రమే కాకుండా, నిర్మాతగా కూడా వ్యవహరించాడు. చైల్డ్ అబ్యూజ్ అనే హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ అరుణ్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చిరస్థాయిగా గుర్తుంచుకునేలా తీసాడు. ఇక ఈ సినిమాలో సిద్దార్థ్ కి ఎంత మంచి పేరు వచ్చిందో, ఆయన మేనకోడలుగా చేసిన అమ్మాయికి కూడా అంతే పేరు ప్రఖ్యాతలు వచ్చాయి.

ఈ చిన్నారి పేరు ‘సహస్ర శ్రీ’. ఈ చిత్రం లో ఆమె ఎంతో సహజ సిద్దమైన నటనని కనబర్చింది. ఎవరీ పాప ఇంత చక్కగా నటించింది, ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదే అని ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు అనుకున్నారు. ఆమె తెలుగు ఆడియన్స్ కి కొత్తనే అయ్యుండొచ్చు కానీ, తమిళ ఆడియన్స్ కి మాత్రం బాగా సుపరిచితమే. ఇది వరకు ఎన్నో సినిమాల్లో నటించింది, ఇక యూట్యూబ్ లో కూడా పలు ఇంటర్వ్యూస్ ఇచ్చి బాగా పాపులర్ అయ్యింది.

అయితే ఈ పాప (Sahasra Sree) మరెవరో కాదు, ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ కజిన్ కొడుకు కి కూతురు అట. సిద్దార్థ్ కి మొదటి నుండి ప్రకాష్ రాజ్ తో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. ఇద్దరికీ ఇంచుమించుగా ఒకే వయస్సు కూడా ఉంటుంది. సిద్దార్థ్ ఈ సినిమాని తియ్యాలనే ఆలోచన ప్రకాష్ రాజ్ కి చెప్పినప్పుడు ఆయన మా అమ్మాయి నువ్వు చెప్పిన పాత్రకి సరిగ్గా సరిపోతుంది, ట్రై చెయ్యమని చెప్పాడట, అలా సహస్ర శ్రీ ఈ సినిమాలోకి వచ్చింది.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus