పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న కీర్తి సురేష్..ఆకట్టుకుంటున్న ‘చిన్ని’ ట్రైలర్..!

కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన లేటెస్ట్ తమిళ్ మూవీ ‘సాని కాయిదమ్’.అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తెలుగులో ‘చిన్ని’ పేరుతో విడుదల కాబోతుంది. మే 6న ‘అమెజాన్ ప్రైమ్’ ఓటిటిలో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండీ విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. మరీ ముఖ్యంగా కీర్తి సురేష్ ను ఇంత డీగ్లామర్ గా అలాగే ఇంత రఫ్ గా చూడడం ఇదే మొదటిసారి కావడంతో సినిమాపై ఆసక్తి నెలకొంది.

Click Here To Watch NOW

దానిని మరింత డబుల్ చేస్తూ తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. 3 నిమిషాల 13 సెకన్ల నిడివి గల ఈ ట్రైలర్ లో రంగయ్య పాత్రలో సెల్వరాఘవన్ కనిపిస్తున్నాడు. 24 హత్యలు చేసినట్టు ఇతను చెబుతున్నాడు. అలాగే చిన్ని పాత్రలో కీర్తి సురేష్ 25 హత్యలు చేసినట్లు చెబుతుంది.పగ, ప్రతీకారాలతో రగిలిపోతున్న అమ్మాయిలా ఈమె కనిపించింది. హెడ్ కానిస్టేబుల్ అయిన చిన్ని ఎందుకు కిల్లర్ గా మారాల్సి వచ్చింది?

అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అసలు ఆమె పగ ఎవరి పై? అనే విషయాలతో సస్పెన్స్ ను క్రియేట్ చేస్తూ ఆసక్తిని పెంచుతూ ట్రైలర్ ను కట్ చేశారు. ఇందులో చాలా వయొలెన్స్ సీన్లు ఉన్నాయి. ‘ఖైదీ’ ఫేమ్ సామ్ సి ఎస్ అందించిన నేపధ్య సంగీతం హైలెట్ గా నిలిచింది. ‘స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’ బ్యానర్ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మధ్య కాలంలో కీర్తి సురేష్ నటించిన సినిమాలేవీ సక్సెస్ కాలేదు. మరి ఈ మూవీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి..!

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!


‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Share.