మెగాస్టార్ చిరంజీవి 65 ఏళ్ల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. స్టార్ హీరోలు ఒకటి, రెండు సినిమాలు చెయ్యడానికే కిందా మీదా పడుతుంటే.. ఈయన మాత్రం 3 సినిమాలతో బిజీగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అందులో ఒకటి విడుదలకు సిద్ధంగా ఉన్న ‘ఆచార్య’. కొరటాల శివ దీనికి దర్శకుడు. మరొకటి మెహర్ రమేష్ డైరెక్షన్లో చెయ్యబోతున్న ‘వేదాలం’ రీమేక్. దీంతో పాటు మోహన్ రాజా డైరెక్షన్లో ‘లూసీఫర్’ రీమేక్ లో కూడా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గిన వెంటనే ‘ఆచార్య’ రిలీజ్ కాబోతుంది.
మే 13న విడుదల చెయ్యబోతున్నట్టు ప్రకటించినప్పటికీ.. ఇప్పుడు అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. ఈ 3 ప్రాజెక్టులు కంప్లీట్ కాకుండానే తరువాత చెయ్యబోయే ప్రాజెక్టుల పై చిరు దృష్టి పెట్టినట్టు టాక్. శ్రీను వైట్ల డైరెక్షన్లో ‘ఎన్నై అరిందాల్'(రీమేక్) చెయ్యడానికి చర్చలు జరుపుతున్నారని మొన్నామధ్య వార్తలు వచ్చాయి. అయితే దానికంటే ముందు శ్రీను వైట్ల.. విష్ణుతో ఓ మూవీ కంప్లీట్ చేసుకుని రావాలి. మరోపక్క మురుగదాస్ డైరెక్షన్లో కూడా చిరు ఓ సినిమా చెయ్యడానికి రెడీ అవుతున్నారట. గతంలో వీరి కాంబినేషన్లో ‘స్టాలిన్’ మూవీ వచ్చింది.
అది అబౌవ్ యావరేజ్ గా ఆడింది. అయితే చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీస్ అయిన ‘ఠాగూర్’ ‘ఖైదీ నెంబర్ 150’ .. మురుగదాస్ కథలతోనే రూపొందాయి. ఈ మధ్యనే చిరుకి మురుగదాస్ వీడియో కాల్ చేసి ఓ కథ వినిపించారట. అది చిరుకి నచ్చింది అని సమాచారం. ఇదే కథతో తమిళంలో విజయ్ వంటి పెద్ద హీరోతో చెయ్యాలి అని అనుకున్నారట మురుగదాస్.కానీ అతను ఇప్పుడు వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. తెలుగులో కూడా కొంతమంది ఈ కథని వినిపించాడట మురుగ. కానీ చిరు మాత్రమే ఓకే చేసినట్టు టాక్.