మెగా బర్త్‌డే ఫన్‌: చిరంజీవి బర్త్‌డే వీడియో వైరల్‌.. మీరు చూశారా?

చిరంజీవి పుట్టిన రోజు అంటే ఆయన కుటుంబానికి, అభిమానులకు పండగే. ఏటా ఆగస్టు 22న ఘనంగా పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకుంటూ ఉంటారు. ఆయన ఫొటోలు స్టేటస్‌లు పెట్టుకుని, సినిమాల క్లిప్స్‌ను షేర్‌ చేసుకుంటూ ఎంజాయ్‌ చేస్తుంటారు. అలాంటివారికి మరో వీడియో అందుబాటులలోకి వచ్చింది. అదే ఈ ఏడాది చిరంజీవి పుట్టిన రోజు జరుపుకున్న వీడియో. బర్త్‌డే సెలబ్రేషన్స్‌ వీడియోను చిరంజీవే సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.‘‘ఈ ఏడాది పుట్టిన రోజును నగరానికి దూరంగా.. కుటుంబంతో ఇలా జరుపుకున్నాను. వారితో చక్కగా సమయాన్ని గడిపాను. ఎంతో ఆనందాన్నిచ్చిన అనుభూతులివీ’’ – చిరంజీవి

సోషల్‌ మీడియాలో వీడియోను షేర్‌ చేస్తూ చిరంజీవి రాసుకొచ్చిన మాటలివీ. ఆ వీడియోను చూసిన అభిమానులు సూపర్‌ అంటూ సంబరపడిపోతున్నారు. అయితే ఎప్పటిలాగే మెగా అభిమానుల్లోని పవన్‌ అభిమానులు మాత్రం ‘పవర్‌స్టార్‌ కూడా ఉంటే బాగుండు’ అని కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫ్రేమ్‌లో ఆయన లేకపోవడం ఎంతైనా లోటుగానే కనిపిస్తుంది అనుకోండి. అయితే ఆయన రాజకీయ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారనే విషయం తెలిసిందే. వీడియోలో చూస్తే.. చిరంజీవి కుటుంబంలో కుర్ర హీరోలు, కూతుళ్లు, వారి పిల్లలు, ఇంకొంతమంది చిన్నారులు కనిపించారు.

రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ను కూడా ఈ వీడియోలో చూడొచ్చు. ఈసారి చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు కామారెడ్డి జిల్లా దోమకొండలోని గడీ కోటలో జరిగాయి. మామూలుగా చిరంజీవి జన్మదినం బెంగళూరులో జరుగుతూ ఉంటుంది. ఏటా ఆగస్టు 22 నాటికి కుటుంబసభ్యులు మొత్తం బెంగళూరులో చిరంజీవి కుటుంబ ఫామ్‌ హౌస్‌కి వెళ్లిపోతారు. మొత్తం కుటుంబం ఆ రోజు అక్కడ ఉండేలా చిరంజీవి చూసుకుంటారని, గతంలో కుటుంబసభ్యులు కొంతమంది చెప్పారు.

అయితే ఈ ఏడాది దానికి భిన్నంగా పుట్టిన రోజు వేడుకలను తన వియ్యంకుడికి చెందిన గడీకోటలో చేసుకున్నారు చిరంజీవి. ఇక చిరంజీవి సినిమాల సంగతి చూస్తే.. ‘గాడ్‌ ఫాదర్‌’ టీజర్‌ను జన్మదినం సందర్భంగా విడుదల చేశారు. దసరా సందర్భంగా అక్టోబరు 5న ఈ సినిమాను విడుదల చేస్తారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus