మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. కొరటాల శివ ఎంచుకున్న కథలో పొరపాట్లు జరగడం, సంవత్సరాల పాటు సినిమాను తెరకెక్కించడం, ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా కథ లేకపోవడం, పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న చరణ్ పాత్ర ప్రాణాలు కోల్పోవడం ఈ సినిమా ఫెయిల్యూర్ కు కారణమయ్యాయి. తాజాగా లాల్ సింగ్ చద్దా ప్రెస్ మీట్ కు హాజరైన చిరంజీవి లాల్ సింగ్ చద్దా మూవీలో అమీర్ ఖాన్ నటన నన్ను కదిలించిందని
ఇలాంటి పాత్రలు చేయడం అమీర్ ఖాన్ కు మాత్రమే సాధ్యమవుతుందని వెల్లడించారు. నేను ఆ ధైర్యం చేయలేదని ఆయన చెప్పుకొచ్చారు. జనరంజకంగా ఉండే సినిమాలను మాత్రమే నేను చేస్తానని ఆయన కామెంట్లు చేశారు. జనాల్ని మెప్పించి ఒప్పించే పాత్రలలో మాత్రమే అమీర్ ఖాన్ నటిస్తాడని చిరంజీవి అన్నారు. ఎలాంటి పాత్రలు వేస్తే జనం శభాష్ అంటారో అలాంటి పాత్రలకు మాత్రమే నేను ఓటేస్తానని ఆయన వెల్లడించారు. కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా కొన్ని జరుగుతుంటాయని చిరంజీవి ఆచార్య రిజల్ట్ గురించి పరోక్షంగా చెప్పుకొచ్చారు.
సినిమాల ఫలితాల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదని ఆయన తెలిపారు. జులై 24వ తేదీ నాటికి ఇంద్ర మూవీ రిలీజై 20 సంవత్సరాలు కావడంతో ఆ సినిమా గురించి అమీర్ ఖాన్ తో చిరంజీవి పంచుకున్నారు. రీఎంట్రీలో చిరంజీవి నటించిన సినిమాలలో ఖైదీ నంబర్ 150 ఘన విజయం సాధించగా సైరా నరసింహారెడ్డి హిట్టైనా భారీ స్థాయిలో కలెక్షన్లు అయితే రాలేదు.
మరోవైపు చిరంజీవి కథల ఎంపిక విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలని సినిమాలు ఆలస్యమైనా పరవాలేదని కచ్చితంగా విజయాలను సొంతం చేసుకునే ప్రాజెక్ట్ లకు ఓటేయాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!