రామ్ చరణ్ కు (Ram Charan) డాక్టరేట్ రావడం మెగా అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. క్లీంకార పుట్టిన తర్వాత చరణ్ కు కెరీర్ పరంగా మరింత కలిసొస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ కు డాక్టరేట్ రావడం టాలీవుడ్ ఇండస్ట్రీకి గర్వ కారణమని ఫ్యాన్స్ చెబుతున్నారు. చరణ్ కు డాక్టరేట్ రావడంతో మెగాస్టార్ ఎమోషనల్ కాగా ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వేల్స్ యూనివర్సిటీ రామ్ చరణ్ కు డాక్టరేట్ అందించడం చూసి తండ్రిగా గర్వపడుతున్నానని చిరంజీవి (Chiranjeevi) పేర్కొన్నారు.
ఇవి ఎమోషన్స్ తో కూడిన క్షణాలు అని ఆయన చెప్పుకొచ్చారు. నాకు చెప్పలేనంత ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. పిల్లలు కెరీర్ పరంగా సక్సెస్ అవుతున్న సమయంలోనే తల్లీదండ్రులకు నిజమైన ఆనందం కలుగుతుందని చిరంజీవి వెల్లడించడం గమనార్హం. లవ్ యూ మై డియర్ డాక్టర్ రామ్ చరణ్ అంటూ చిరంజీవి చేసిన కామెంట్లు అభిమానులకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. చిరంజీవి, రామ్ చరణ్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
చిరంజీవికి విశ్వంభరతో (Vishwambhara) చరణ్ కు గేమ్ ఛేంజర్ తో కెరీర్ బెస్ట్ హిట్లు దక్కాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ వరుసగా మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇకపై చరణ్ సినిమాలు వేగంగా విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. చరణ్ కు ఇతర భాషల్లో సైతం క్రేజ్ పెరుగుతుండగా నటుడిగా చరణ్ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు.
రాబోయే రోజుల్లో చరణ్ కెరీర్ ను ఏ రేంజ్ లో ప్లాన్ చేసుకుంటారో చూడాలి. ప్రతి సినిమా పాన్ ఇండియా రేంజ్ లో హిట్ గా నిలిచేలా చరణ్ ప్లానింగ్ ఉంది. చరణ్ బుచ్చిబాబు (Buchi Babu Sana) కాంబో మూవీ ఈ ఏడాదే మొదలుకానుండగా చరణ్ సుకుమార్ (Sukumar) కాంబో మూవీ వచ్చే ఏడాది నుంచి మొదలుకానుందని తెలుస్తోంది.