Chiranjeevi: సంక్రాంతి సినిమా పై చిరు కామెంట్స్..ఎన్నొచ్చినా ఆపలేరంటూ!

‘అదేంటి.. దిల్ రాజు పేరు చెప్పి ‘హనుమాన్’ కి చిరు బూస్టప్ ఇవ్వడం ఏంటి? అసలు ‘హనుమాన్’ కి థియేటర్స్ ఇవ్వకుండా చేసి ఇబ్బంది పెడుతుందే దిల్ రాజు కదా?’ అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు ముందే పప్పులో కాలేసినట్టు. చిరు ‘హనుమాన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సంక్రాంతి సినిమాల ప్రస్తావన తెచ్చారు. ‘ఈ సీజన్ సినిమాలకి చాలా మంచి సీజన్. ఎన్ని సినిమాలు వచ్చినా..అన్నిటినీ ప్రేక్షకులు చూస్తారు.. నచ్చితే ఆదరిస్తారు’ అంటూ చిరు చెప్పుకొచ్చారు.

తర్వాత 2017 సంక్రాంతి సీజన్ ను గుర్తు చేశారు. ఆ టైంలో చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150 ‘ , బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రిలీజ్ అయ్యాయి. వీటితో పాటు శర్వానంద్ నటించిన ‘శతమానం భవతి’ సినిమా కూడా సైలెంట్ గా రిలీజ్ అయ్యింది. రెండు పెద్ద సినిమాల నడుమ ఈ చిన్న సినిమా నిలబడుతుందా? అనే డౌట్ అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఉండనే ఉంది.

అయితే సైలెంట్ గా ఆ సినిమా కూడా సక్సెస్ అయ్యింది. అంతే కాదు సంక్రాంతి పండుగ సెలవులు ముగిశాక.. ఆ సినిమా గట్టిగా పుంజుకుంది.ఆ తర్వాత థియేటర్స్ పెరిగాయి. కలెక్షన్స్ పెరిగాయి. ఓ రకంగా సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అయిన సినిమాల్లో బయ్యర్స్ కి ఎక్కువ లాభాలు అందించిన సినిమా ఇదే అని చెప్పాలి. అందుకే దిల్ రాజు ప్రస్తావన తీసుకొచ్చారు చిరు. వాస్తవానికి… ‘ ‘ఖైదీ నెంబర్ 150 ‘ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వంటి పెద్ద సినిమాల మధ్య ఎందుకు ఇబ్బంది పడటం మీ సినిమాని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా?’ అని చిరంజీవి దిల్ రాజుతో చెప్పారట.

కానీ దిల్ రాజు.. ‘తమ సినిమాకి ఎక్కువ థియేటర్స్ దక్కకపోయినా జనాలు చూస్తారు సార్.. మాకేమీ ఇబ్బంది లేదు’ అంటూ చిరుకి బదులిచ్చారట. అలా ఆ సినిమా కూడా సక్సెస్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుంది అంటూ చిరు ‘హనుమాన్’ మేకర్స్ కి ధైర్యం చెప్పారు. ఇక సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా జనాలను ఎవ్వరూ థియేటర్ కి రాకుండా ఆపలేరని కూడా చిరు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

 

 

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus