రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేసింది. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలై ఘనవిజయం సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమా సినీ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకోవడమే కాకుండా అనేక అవార్డులు కూడా దక్కించుకుంది. ప్రపంచ సినిమా వేదికపై ఆర్ఆర్ఆర్ సినిమా మన భారతీయ సినిమా గొప్పతనాన్ని నిరూపించింది.
ఇటీవల నిర్వహించిన గోల్డెన్ గ్లోబల్ అవార్డులలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకి అవార్డు దక్కింది. ఇక గోల్డెన్ గ్లోబల్ అవార్డు దక్కటంతో భారతీయ సినీ వర్గాలు దీనిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆర్ఆర్ఆర్ టీమ్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి .. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.
ఆర్ఆర్ఆర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలవడం చారిత్రాత్మక విజయం అంటూ అభినందించారు. అలాగే లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ కూడావిషయం గురించి స్పందించారు. నాటు నాటు సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి ఎంపిక కావడం మహా అద్భుతమంటూ ప్రశంసింస్తూ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈ సందర్భంగా స్పందిస్తూ ఎం ఎం కీరవాణి, రాజమౌళికి శుభాకాంక్షలు తెలియజేశాడు.
ఇక జూనియర్ ఎన్టీఆర్, జయం రవి, డైరెక్టర్ క్రిష్ వంటి సినీ ప్రముఖులు ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా కీరవాణి, రాజమౌళికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇటీవల జరిగిన గోల్డెన్ గ్లోబల్ అవార్డు కార్యక్రమానికి రాజమౌళి, కీరవాణి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి సతీమణులతో హాజరు అయ్యారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!
రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!