రాజకీయాల్లో ఉన్న ఇబ్బందులను పక్కకు నెట్టి మళ్ళీ సినిమా పరిశ్రమనే నమ్ముకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. తనను ఆదరించిన కళామతల్లిని నమ్ముకుని మళ్లీ సినిమా పరిశ్రమలోనే తన టీ ఎంట్రీని మొదలు పెట్టాడు. అయితే ఎంతటి మెగాస్టార్ అయినా ఫార్మ్ కోల్పోతే కష్టమే అన్నది చిరుని చూస్తే అర్ధం అవుతుంది. గతంలో ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన మెగాస్టార్ సెకెండ్ ఇన్నింగ్స్ పెద్దగా కలసి రావడంలేదు అనిపిస్తుంది.
ఎంత ప్రయత్నించినా అనుకున్నంతగా ఈ సినిమా ముందుకు సాగడం లేదు. ఎన్నో ఇబ్బందుల మధ్య ఈ సినిమా షూటింగ్ ముందుకు సాగుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ మాటలు అందిస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అదే క్రమంలో పరుచూరి వాళ్ల కలం పదును గురించి సైతం మనకు తెలిసిందే. మరి అలాంటి టాప్ రైటర్స్ తో సినిమాను రాయించుకోవాలి అని అనుకున్న చిరు అకస్మాత్తుగా మరో రైటర్ సాయి మాధవ్ ను తన 150వ సినిమాలో డైలాగ్స్ రాయించేందుకు ఎందుకు ఫోన్ చేసి మరీ పిలిపించాడు అన్న టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది.
అయితే ఆల్రెడీ సినిమా మీద పనిచేస్తున్న పరుచూరి సోదరులను పక్కన పెట్టి సాయి మాధవ్ తో మాటలు రాయించడం పట్ల వారిని అవమానించి నట్టే అన్న వాదన బలంగా వినిపిస్తుంది. అదే క్రమంలో ఏం చేసినా సినిమా హిట్ కావాలనే అందరు కోరు కునేది. దానికి ఎవరు ఎవరితో పనిచేసినా ఏం కాదు అన్న వాదన సైతం తెరపైకి వస్తుంది. ఏది ఏమైనా…ఈ మ్యాటర్ ఇండస్ట్రీలో కాస్త హాట్ హాట్ గా నడుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.