Chiranjeevi: ‘భోళా శంకర్’ విషయంలో చిరంజీవి కాన్ఫిడెన్స్ ఏంటో తెలుసా!

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత ఫుల్ ఎనర్జీతో వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్‌లో పెడుతున్నారు.. పాండమిక్ గ్యాప్ రాకుండా ఉండి ఉంటే కనుక.. మరో రెండు సినిమాలు రిలీజ్ చేసుండేవారు.. 65 ఏళ్లు దాటినా యంగ్ హీరోలకు పోటీనిస్తూ, తనకు తానే సాటి అంటూ దూసుకెళ్తున్నారు.. గతేడాది ‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ విడుదల చేసి.. ఈ ఏడాది సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ గా బ్లాక్ బస్టర్ కొట్టారు.. మార్చి 3 నాటికి విజయవంతంగా 50 రోజులు పూర్తి చేసుకుందీ చిత్రం..

దీంతో రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు చిరు.. ‘వాల్తేరు వీరయ్య’ విజయంతో తన నుండి ప్రేక్షకాభిమానులు ఏం కోరుకుంటున్నారో అర్థమయిందని.. తన ట్రేడ్ మార్క్ ట్రాక్ తప్పకుండా.. ప్రయోగాల జోలికి పోకుండా పక్కా మాస్ మసాలా మూవీస్ చేయాలని డిసైడ్ అయినట్టు ఇటీవల చెప్పారు చిరు.. అందుకే ‘భోళా శంకర్’ స్క్రిప్ట్‌లో అవసరమైన చోట మార్పులు చేర్పులు చేయిస్తున్నారు.. పనిలో పనిగా తన పాటను తానే రీమిక్స్ చేయబోతున్నారు మెగాస్టార్..

చూడాలని ఉంది’ లో ‘రామ్మా చిలకమ్మా’ సాంగ్ ఎవర్ గ్రీన్ చార్ట్ బస్టర్.. దీన్ని వచ్చే సినిమాలో మాంచి ఊపుతో రీమిక్స్ చేయనున్నారనే వార్త వైరల్ అవుతోంది.. మిల్కీ బ్యూటీ తమన్నాతో త్వరలో ఓ సాంగ్ షూట్ చేయబోతున్నారు.. కీర్తి సురేష్ చెల్లెలిగా కనిపించనుండగా.. మోహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇదిలా ఉంటే.. కాస్త ఆలస్యం అయినా కానీ ‘భోళా శంకర్’ కాన్ఫిడెంట్‌గా ఉన్నారట చిరు.. ఎందుకంటే కథ నేపథ్యం కలకత్తాలో జరుగుతోంది..

తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మెమరబుల్ ఫిలింగా నిలిచిపోయిన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘చూడాలని ఉంది’ కథ కూడా కలకత్తాలోనే జరుగుతోంది.. ఇందులోనూ అదే ప్లేస్, బ్యాక్ డ్రాప్ కావడం అనేది సెంటిమెంట్‌గా కలిసి రావడమే కాక.. ఆ సినిమాలా ఇది కూడా కచ్చితంగా విజయం సాధిస్తుందనే ధీమాతో ఉన్నారు మెగాస్టార్..

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus