నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా గిరిబాబు ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. దాదాపు 35 సంవత్సరాల క్రితం గిరిబాబు మెరుపుదాడి అనే సినిమాను చిరంజీవి, మోహన్ బాబుతో చేయాలని అనుకున్నారు. అయితే ఆ సినిమాలో నటించడానికి మోహన్ బాబు అంగీకరించలేదు. ఆ తరువాత గిరిబాబు ఆ సినిమాను సుమన్, భానుచందర్ లతో కలిసి తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. 29 లక్షల రూపాయలతో తెరకెక్కిన మెరుపుదాడి 1984 సంవత్సరం జూన్ 9వ తేదీన రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమాను హైదరాబాద్ లోని సంగం థియేటర్ లో చూసిన చిరంజీవి ఒక మంచి సినిమాలో నటించే అవకాశాన్ని మిస్ చేసుకున్నానని బాధ పడ్డారని ఆ సినిమా చూసి మోహన్ బాబు సైతం బాధపడ్డారని గిరిబాబు తెలిపారు. మరోవైపు చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎప్పుడు రిలీజవుతుందనే కన్ఫ్యూజన్ ప్రేక్షకుల్లో నెలకొంది. సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత చిరంజీవి నటించిన సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ నెల 13వ తేదీన రిలీజ్ కావాల్సిన ఆచార్య వాయిదా పడింది.
దాదాపు పదిరోజుల షూటింగ్ ఉండటంతో ఈ సినిమా జులైకు వాయిదా పడిందని, ఆగష్టుకు వాయిదా పడిందని వార్తలు వస్తున్నాయి. సినిమా వాయిదా పడటం వాస్తవమే అయినా సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది. మరోవైపు చిరంజీవి లూసిఫర్, వేదాళం రీమేక్ లలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ఈ సినిమాల షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియాల్సి ఉంది. మెగాస్టార్ కు కరోనా వైరస్ కొత్త కష్టాలను తెచ్చిపెట్టిందనే చెప్పాలి.